భవానీపూర్ లో మమత దిగులంతా అదేనట
మమత బెనర్జీకి బెదురులేదు. భయం అసలే లేదు. ఆమె కు ఉన్న అస్సెట్ అదే. రాజకీయాల్లో అదే కావాలి. ప్రత్యర్థులను చూసి భయపడితే సగం జయం మాయమయినట్లే. [more]
మమత బెనర్జీకి బెదురులేదు. భయం అసలే లేదు. ఆమె కు ఉన్న అస్సెట్ అదే. రాజకీయాల్లో అదే కావాలి. ప్రత్యర్థులను చూసి భయపడితే సగం జయం మాయమయినట్లే. [more]
మమత బెనర్జీకి బెదురులేదు. భయం అసలే లేదు. ఆమె కు ఉన్న అస్సెట్ అదే. రాజకీయాల్లో అదే కావాలి. ప్రత్యర్థులను చూసి భయపడితే సగం జయం మాయమయినట్లే. మమత బెనర్జీకి ఇది తెలియంది కాదు. అందుకే మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం సాధించగలిగారు. అంటే పదిహేనేళ్ల పాటు మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ ను పాలించే అవకాశం దక్కింది. అయితే ఆమె గత ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం కొంత ఇబ్బంది కరమైన అంశమే.
ఉప ఎన్నికలపైనే?
రాజకీయంగా పట్టు ఉండటం, పార్టీపై గ్రిప్ తో మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలల్లో మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. శాసన మండలి కూడా లేకపోవడంతో మమత బెనర్జీ ఉప ఎన్నికలపై నే ఆశలు పెట్టుకున్నారు. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.
పోటీ చేసి…
మమత బెనర్జీ తిరిగి భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తనను ఆదరించిన, గెలిపిస్తున్న భవానీపూర్ ను కాదని మమత బెనర్జీ నందిగ్రామ్ కు వెళ్లారు. భవానీపూర్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. నందిగ్రామ్ లో మాత్రం మమత ఓడిపాయారు. దీంతో మమత బెనర్జీ గెలిచేందుకు భవానీపూర్ లో గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో తిరిగి ఉప ఎన్నిక అనివార్యమయింది.
మెజారిటీపైనే?
భవానీపూర్ లో మమత బెనర్జీ గెలుపుపై పెద్ద అనుమానాలు లేకపోయినా ముందు జాగ్రత్త చర్యలు అన్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే భవానీపూర్ నియోజకవర్గంలో గ్రామాల వారీగా బాధ్యులను నియమించారు. తన గెలుపు కంటే మమత బెనర్జీ మెజారిటీపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అత్యధిక మెజారిటీ రావాలని మమత బెనర్జీ నేతలను ఆదేశించారు. మొత్తం మీద మమత బెనర్జీ దిగులంతా గెలుపుపై కాదట… మెజారిటీపైనేనట.