పంచుకోలేదు… పట్టించుకోలేదు
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డోన్ట్ కేర్ అన్నారు. తన దారి తనదేనన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ కు వచ్చిన [more]
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డోన్ట్ కేర్ అన్నారు. తన దారి తనదేనన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ కు వచ్చిన [more]
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డోన్ట్ కేర్ అన్నారు. తన దారి తనదేనన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ కు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న కార్యక్రమంలో మమత బెనర్జీ పాల్గొనలేదు. ప్రొటోకాల్ ను సయితం పక్కన పెట్టి ఆమె నేరుగా సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీకి వెళ్లిపోవడం విశేషం. ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ కోల్ కత్తా వచ్చారు. అక్కడ పోర్ట్ ట్రస్ట్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
ఒకే వేదికను పంచుకోవాల్సిన….
కోల్ కత్తా పోర్ట్ ట్రస్ట్ 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ పోర్టుకు శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టుగా కూడా మోదీ పేరు పెట్టారు. ఇంతటి పెద్ద ఈవెంట్ కు మమత బెనర్జీ డుమ్మ కొట్టారు. ప్రధాని పాల్గొన కార్యక్రమంలో మమత పాల్గొనలేదు. ఆ వేదికను మోదీతో కలసి పంచుకోవడం ఇష్టంలేకనే మమత బెనర్జీ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
మర్యాదపూర్వకంగానే…
అయితే శనివారమే మోదీ కోల్ కత్తాకు వచ్చారు. రాజ్ భవన్ లో మాత్రం మోదీని మమత బెనర్జీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీతో సీఏఏ, ఎన్సార్సీ విషయంపై పునరాలోచించాలని మాత్రమే కోరారు. వాటిని ఉప సంహరించుకోవాలని కోరారు. ఈ తర్వాత మమత బెనర్జీ సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు.
తప్పుడు సంకేతాలని…..
మరికొద్దిరోజుల్లోనే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. మమత బెనర్జీకి ప్రధాన శత్రువు బీజేపీయే కావడంతో మోదీతో ఒకే వేదికను పంచుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని మమత భావించారు. అందుకే మోదీ సభకు దూరంగా ఉన్నారు. అలాగే ఈనెెల 13వతేదీన సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న విపక్షాల కూటమి సమావేశానికి కూడా మమత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద మమత బెనర్జీ మోదీ వచ్చినా తనకేం పట్టన్నట్లు వేదికను పంచుకోకుండా, పట్టించుకోకుండా ఉండటం చర్చనీయాంశమైంది.