మమతకు “వైరస్” ముప్పు తెచ్చిపెడుతుందా?
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కరోనా కఠిన సమయంలోనూ కలసి పనిచేయాల్సిన అధికార, విపక్షాలు వ్యాధి నిరోధానికి ప్రయత్నం చేయకుండా [more]
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కరోనా కఠిన సమయంలోనూ కలసి పనిచేయాల్సిన అధికార, విపక్షాలు వ్యాధి నిరోధానికి ప్రయత్నం చేయకుండా [more]
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కరోనా కఠిన సమయంలోనూ కలసి పనిచేయాల్సిన అధికార, విపక్షాలు వ్యాధి నిరోధానికి ప్రయత్నం చేయకుండా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బీజేపీ సయితం ఈసారి బెంగాల్ తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.
పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో…..
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి ఊపునిచ్చాయి. దీంతో బీజేపీ గత ఏడాది నుంచి అక్కడ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుంది. దీంతో మమత బెనర్జీ అప్రమత్తమయ్యారు. ప్రశాంత్ కిషోర్ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో పనిని ప్రారంభించింది. ప్రశాంత్ కిషోర్ టీం సలహాలు, సూచనల మేరకు మమత బెనర్జీ మూడు నెలల క్రితమే ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ప్రశాంత్ కిషోర్ ను రప్పించి….
మమత బెనర్జీ బెంగ్లా గార్బో మమత అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రధానంగా బీజేపీ పార్లమెంటు స్థానాలు గెలిచిన 18 నియోజకవర్గాల్లో మమత బెనర్జీ దృష్టి పెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. కరోనా సహాయ కార్యక్రమాల్లో అధికార పార్టీ తప్ప మరెవ్వరూ పాల్గొనకుండా ఆంక్షలు విధించారు. దీంతో బీజేపీ కూడా మమత బెనర్జీ పై ఎదురుదాడికి దిగింది. సోషల్ మీడియాలో బీజేపీ మమత బెనర్జీని ఎండగడుతోంది.
సోషల్ మీడియాలో యుద్ధం…..
మరోవైపు కేంద్రం నుంచి వచ్చిన బృందం విషయంలోనూ మమత బెనర్జీ అభ్యంతరం తెలిపారు. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. మర్కజ్ నుంచి వచ్చిన వారికి కూడా సక్రమంగా మమత బెనర్జీ ప్రభుత్వం పరీక్షలు జరలేదన్నది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. జాతీయ మీడియా సయితం మమత ధోరణిని తప్పుపడుతోంది. దీంతో మమత బెనర్జీ కొంత భయాందోళనలకు లోనవుతున్నారు. వెంటనే ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దిగాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం తరుపున ప్రచారం చేయాలని, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. దీంతో ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో కరోనా వేళ రాజకీయ పరిణామాలు మాత్రం వేగంగా మారుతున్నాయి.