దీదీ ప్రతీకారం అలా తీర్చుకుంటారా?
పశ్చిమ బెంగాల్ లో పోట ీనువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ల మధ్య రసవత్త పోరు సాగుతుంది. గెలుపు అవకాశం ఎవరికి అన్నది [more]
పశ్చిమ బెంగాల్ లో పోట ీనువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ల మధ్య రసవత్త పోరు సాగుతుంది. గెలుపు అవకాశం ఎవరికి అన్నది [more]
పశ్చిమ బెంగాల్ లో పోట ీనువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ల మధ్య రసవత్త పోరు సాగుతుంది. గెలుపు అవకాశం ఎవరికి అన్నది చివరి వరకూ చెప్పలేం. ఒపీనియన్ పోల్స్ లోనూ కొన్ని మమత బెనర్జీకి అనుకూలంగా వస్తే, మరికొన్ని బీజేపీకి సానుకూలంగా వచ్చాయి. అయితే పశ్చిమ బెంగాల్ లో జరిగే ఎన్నికలు రానున్న కాలంలో జాతీయ రాజకీయాలను మార్చి వేస్తాయని స్పష్టంగా చెప్పవచ్చంటున్నారు.
పదేళ్ల పాటు సీఎంగా….
మమత బెనర్జీ ఇప్పటికే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోసారి విజయం సాధిస్తే ఆమె కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని, జాతీయ రాజకీయాల వైపు వెళతారని పార్టీ నుంచి గట్టిగా ప్రచారం జరుగుతుంది. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మమత బెనర్జీ బెంగాల్ లో మరోసారి గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ విజయం ఆమెను జాతీయ రాజకీయాల వైపు వెళ్లేలా చేస్తుందంటున్నారు.
ఎన్నడూ లేని విధంగా….
కమ్యునిస్టులు అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మమత బెనర్జీ ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొన లేదు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ పశ్చిమ బెంగాల్ లో దూసుకు వచ్చింది. కాంగ్రెస్, కమ్యునిస్టులనే తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన మమత బెనర్జీ బీజేపీని లైట్ తీసుకోవడం వల్లనే ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ లో విస్తరించగలిగిందంటున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ అన్ని రకాలుగా బీజేపీతో మమత బెనర్జీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మోదీ, షాలే టార్గెట్….
తనకు అత్యంత నమ్మకమైన నేతలను బీజేపీ పట్టుకెళ్లడంపై మమత బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఘర్షణలకు కూడా బీజేపీ క్యాడర్ కారణమని మమత భావిస్తున్నారు. దీంతో ఈఎన్నికలలో విజయం సాధించిన తర్వాత హస్తినపై దృష్టి పెట్టాలన్నది మమత బెనర్జీ వ్యూహంగా ఉంది. మోదీ, షాల మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని మమత రగలిపోతుననారు. అందుకే ఈ ఎన్నికల్లో విజయం అనంతరం తాను కేంద్రంలో అధికారంపై దృష్టి పెడతానని మమత బెనర్జీ వ్యాఖ్యానించారంటున్నారు. మొత్తం మీద దీదీ చూపు ఇప్పుడు ఢిల్లీ పై పడింది. అదీ బెంగాల్ లో గెలిస్తేనే.