మండలి జాడేదీ.. రాజకీయాలను విరమించుకున్నారా?
మండలి బుద్ధ ప్రసాద్. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా.. సంస్కృతి , సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శంగా.. మరీ ముఖ్యంగా తెలుగు వెలుగులకు పెట్టని పారాణిగా [more]
మండలి బుద్ధ ప్రసాద్. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా.. సంస్కృతి , సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శంగా.. మరీ ముఖ్యంగా తెలుగు వెలుగులకు పెట్టని పారాణిగా [more]
మండలి బుద్ధ ప్రసాద్. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా.. సంస్కృతి , సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శంగా.. మరీ ముఖ్యంగా తెలుగు వెలుగులకు పెట్టని పారాణిగా పేర్కొనే మండలి బుద్ధ ప్రసాద్ ఏడాది కాలంగా ఎక్కడా యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం. గత ఏడాది ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన మండలి బుద్ధ ప్రసాద్ తాజాగా పార్టీలో ఉన్నారా? లేరా? అనే సందేహం వచ్చేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు టీడీపీ సీనియర్లు. నిజానికి మండలి వల్ల ఏదైనా రాజకీయ ప్రయోజనం జరిగి ఉంటే.. అది కాంగ్రెస్‌కు మాత్రమే పరిమితం.
కాంగ్రెస్ నుంచి వచ్చి….
రాష్ట్ర విభజనకు ముందు ఆయన తండ్రి నుంచి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ సారధులుగా ఉన్నారు. కృష్ణాలో కీలక నాయకుడిగా కూడా ఆయన ఎదిగారు. అయితే, విభజన తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్న మండలి.. 2014 ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. టీడీపీలో ఐదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు ఎక్కడా వినపడలేదు. అదే టైంలో జిల్లాలోనూ అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమతో పాటు టీడీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు. పేరుకు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నా చివరకు నియోజకవర్గ నేతగా పరిమితం అయ్యారు.
పార్టీ కార్యక్రమాల్లో….
ఆయన సొంత నియోజకవర్గంలోనూ అప్పటి మంత్రి దేవినేని ఉమా తన సామాజిక వర్గం నేతలతో మండలి బుద్ధ ప్రసాద్ ని టార్గెట్ చేయించారన్న టాక్ ఉంది. ఇక, గత ఏడాది తన కుమారుడికి అవకాశం ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే, బాబు ససేమిరా అనడంతో ఆయనే పోటీ చేశారు. జగన్ సునామీలో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా మండలి బుద్ధ ప్రసాద్ పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. చంద్రబాబు పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు నిరసనలకు పాల్గొనడం లేదు. అయితే పార్టీ సమావేశాలు పెట్టడమో లేదా ఏదైనా ప్రకటనలు విడుదల చేసే ఛాన్స్ కూడా ఉంది. కానీ, మండలి బుద్ధ ప్రసాద్ ఎక్కడా మీడియా కంటికి కూడా కనిపించడం లేదు.
హైదరాబాద్ లోనే ఉంటూ….
తాజాగా రెండు రోజుల పాటు చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకునే మహానాడును నిర్వహించారు. దీనికి కూడా మండలి బుద్ధ ప్రసాద్ హాజరు కాకపోవడం, పోనీ.. జూమ్ యాప్‌లోనూ ఆయన కనిపించకపోవడం పార్టీలో కొత్త చర్చకు ఛాన్స్ ఇచ్చింది. అసలు మండలి బుద్ధ ప్రసాద్ పార్టీలో ఉన్నట్టా.? లేనట్టా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న మండలి బుద్ధ ప్రసాద్ దాదాపు రాజకీయాల నుంచి తప్పుకొన్నట్టేనని, త్వరలోనే తన కుమారుడిని రంగంలోకి దింపే అవకాశం ఉందని మరో ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది.
ఆయన కుమారుడు మాత్రం….
అయితే, ఆయన కుమారుడు మనసు వైసీపీవైపు మళ్లిందనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి. మండలి బుద్ధ ప్రసాద్ వారసుడు 2019 ఫిబ్రవరిలో సాక్షి పత్రికపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపైనా, తన కుటుంబంపైనా అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ.. ఆయన అప్పట్లో హల్చల్ చేశారు. పోలీసు కేసు కూడా పెట్టారు. తర్వాత ఈ విషయం ఏం జరిగిందో తెలియదు కానీ.. ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక.. తండ్రీ తనయులు ఇద్దరూ కూడా టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. మరి త్వరలోనే ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.