మండవలో మళ్లీ ఆశలు.. అందుకేనా?
సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. ఆయనను పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. [more]
సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. ఆయనను పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. [more]
సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. ఆయనను పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, తరచూ పార్టీలను మార్చే అలవాటు తనకు లేదని మండవ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. దీంతో త్వరలో ఆయనకు కీలక పదవి దక్కుతుందని ఆయన వర్గంలో ఆనందం వ్యక్తమవుతోంది.
టీఆర్ఎస్ లో చేరినా…..
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి నుంచి మండవ వెంకటేశ్వరావు గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 రాష్ట్రం విడిపోక ముందు వరకూ ఆయన యాక్టివ్ గా ఉన్నారు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. కొంతకాలం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరిపోయారు.
స్వయంగా హామీ ఇచ్చారని…..
మండవ వెంకటేశ్వరరావుకు శాసనమండలిలో చోటు కల్పిస్తారని అనుకున్నారు. కానీ ఇంతవరకూ ఆయనకు పదవి దక్కలేదు. దీంతో మండవ వెంకటేశ్వరరావు పార్టీ వీడుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తడంతో కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావుకు పదవి ఇస్తారంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ ఆయనకు లభించిందని చెబుతున్నారు.
త్వరలోనే పదవి?
నిజామాబాద్ జిల్లానుంచి ఇప్పటికే కేఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో తన కుమార్తె కవితకు కేసీఆర్ అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో ఖాళీ కానున్న పోస్టులకు మండవ వెంకటేశ్వరరావుకు కేసీఆర్ పదవి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అందుకే ఆయన తాను పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారంటున్నారు. మొత్తం మీద మండవ వెంకటేశ్వరరావు వ్యవహారం మరోమారు పార్టీలో చర్చనీయాంశమైంది.