మన్మధుడు 2 మూవీ రివ్యూ
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, Viacom 18 మోషన్ పిక్చర్స్, మనం ఎంట్రప్రైజెస్ నటినలు: నాగార్జున, రకుల్ ప్రీత్, సమంత, కీర్తి సురేష్, వెన్నెల [more]
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, Viacom 18 మోషన్ పిక్చర్స్, మనం ఎంట్రప్రైజెస్ నటినలు: నాగార్జున, రకుల్ ప్రీత్, సమంత, కీర్తి సురేష్, వెన్నెల [more]
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, Viacom 18 మోషన్ పిక్చర్స్,
మనం ఎంట్రప్రైజెస్
నటినలు: నాగార్జున, రకుల్ ప్రీత్, సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సురేష్, లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
ఎడిటింగ్: చోట K. ప్రసాద్, బొంతల నాగేశ్వర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: M. సుకుమార్
నిర్మాత: నాగార్జున
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
ఎప్పుడో 16 ఏళ్ళ క్రితం నాగార్జున – విజయ్ భాస్కర్ కాంబో మాటల మాంత్రికుడు తివిక్రం మాటల రచయితగా తెరెక్కిన మన్మధుడు సినిమా తర్వాత నాగార్జున టాలీవుడ్ మన్మధుడిగా వెలుగొందుతున్నాడు. మన్మధుడు సినిమాలో అన్షు ని ప్రేమించి ఆమె చనిపోయినా తెలియని అభి పాత్రలో అమ్మాయిలంటే అస్స్యహించుకుంటూనే… సోనాలి బింద్రే తో ప్రేమలో పడే కేరెక్టర్ లో నాగార్జున నటన అద్భుతం. దాంతోపాటుగా… ఆ సినిమాలో ప్రతి డైలాగ్ హాస్యం నిండిపోయి ఉంటుంది. మన్మధుడు సెకండ్ హాఫ్ లో నాగార్జున, బ్రహ్మానందం తో కలిసి చేసిన కామెడీ ఇప్పటికి బుల్లితెర మీద చూస్తూనే ఉన్నాం. మన్మధుడు సినిమా ఇప్పటికీ టీవీ ల్లో వస్తుంది అంటే… ఆ సినిమా చూడని వారుండరు.. అయితే మన్మధుడు సినిమాకి సీక్వెల్ అంటూ ఓ ఫ్రెంచ్ మూవీ రీమేక్ ని నాగార్జున మన్మధుడు 2 ని చి.ల.సౌ తో దర్శకుడిగా, మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, నిర్మాతగా తెరకెక్కించాడు. నాగార్జున తో హాట్ గర్ల్ రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించడం, మన్మధుడు అంతటి సినిమాకి సీక్వెల్ కావడం, ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లాంటి వాళ్ళు గెస్ట్ రోల్స్ చెయ్యడం, వెన్నెల కిషోర్ కమెడియన్ గా నటించడం వంటి అంశాలతో సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొంది. రకుల్ గ్లామర్, నాగ్ కామెడీ తో మన్మధుడు 2 హిట్ అనిపించుకుందా? ఆఫీసర్ డిజాస్టర్ తర్వాత నాగ్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా? రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ద్వితీయ విఘ్నాన్ని దాటగలిగాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
సాంబశివరావు అలియాస్ సామ్ (నాగార్జున) పోర్చుగల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రేమ అంటేనే మోసం అని, అసలు ప్రేమపైనే నమ్మకం కోల్పోయిన సామ్… ఎప్పుడూ తాను ఆనందంగా ఉండాలని…అందుకే తన ఆనందం కోసమే జీవిస్తుంటాడు. ఇక మన సాంబశివరావుకి ఒక తల్లి (లక్ష్మి) ఇద్దరు అక్కలు (ఝాన్సీ, దేవదర్షిని) ఒక చెల్లి, ఇద్దరు బావలు ఇలా పెద్ద ఫ్యామిలీతో పాటు పర్సనల్ అసిస్టెంట్‌గా కిషోరా (వెన్నెల కిషోర్) ఉంటాడు. వాళ్ల మాటల్ని పెడచెవిన పెట్టి జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు సామ్. వయసు పెరిగిపోతూ.. ముదురు బెండకాయలా తయారవుతున్న సామ్ ని పెళ్లి చేసుకొమ్మని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు సామ్ కుటుంబం వాళ్ళు. అయినా సామ్ కుటుంబం మాత్రం అతను పెళ్లి చేసుకోవడం లేదని బధపడుతుంటే… సామ్, అవంతిక (రకుల్‌ప్రీత్ సింగ్)ని ప్రేమిస్తున్నానని ఆమెని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. అయితే సామ్ పెళ్లి రోజున చెప్పా పెట్టకుండా వెళ్లిపోయేలా అవంతిక తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే తనకు ఉన్న సమస్యల కారణంగా అందుకు ఒప్పుకుని ఇంటికొచ్చిన అవంతిక… సామ్ కుటుంబసభ్యులకి దగ్గరవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సామ్ -అవంతికల పెళ్లి జరిగిందా? నిజంగానే ఒప్పందం ప్రకారం అవంతిక సామ్‌కి దూరంగా వెళ్లిపోయిందా? అనేది మన్మధుడు 2 ని వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన:
నాగార్జున ఈ సినిమాకి మెయిన్ హైలెట్. నాగ్ మధ్య వయస్కుడిని అని గుర్తు చేస్తూనే ప్లేబాయ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, భావోద్వేగాలు కూడా చక్కగా పండించాడు. అవంతికలా నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇన్నేళ్ల తరువాత ఓ ప్రాధాన్యత ఉన్న పాత్ర పడింది. దర్శకుడు రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తనలోని గ్లామర్ యాంగిల్‌ని ఉపయోగిస్తూనే.. ఎమోషన్స్ సీన్స్‌లో మెచ్యూర్డ్‌గా నటించింది. తన క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టుగా వేరియేషన్ చూపిస్తూ మందు కొడుతూ.. సిగరెట్ తాగుతూ రచ్చ చేసింది. ముఖ్యంగా ఝాన్సీకి కిస్ పెట్టే సన్నివేశం పీక్స్ అనే చెప్పాలి. ప్రాధానంగా చెప్పుకోవల్సింది వెన్నెల కిషోర్ పాత్ర గురించి. మన్మథుడు చిత్రంలో బ్రహ్మానందం.. లవంగం పాత్రకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కిషోరా’ పాత్రను తీర్చిదిద్దాడు దర్శకుడు. నాగార్జున-వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్లు పొట్ట చెక్కలు చేస్తాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్లో పెళ్లి క్యాన్సిల్ అయ్యే సీన్లో వీరి కామెడీ పీక్స్ అనే చెప్పాలి. కామెడీ కోసమే వెన్నెల కిషోర్ ట్రాక్ అన్నట్టుగా మాత్రమే కాకుండా కథలో భాగస్వామ్యం చేశాడు. గెస్ట్ రోల్స్ లో కీర్తి సురేశ్, సమంత మెరుస్తారు. లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిని పాత్రల పరిధి మేరకు నటించారు. రావు రమేష్ తనదైన మార్క్ నటనని చూపించి ఆకట్టుకున్నాడు.
విశ్లేషణ:
మన్మధుడు లో ప్రేమికుడిగా అమ్మాయి చేతిలో మోసపోయానని అని.. అమ్మాయిలంటే అస్సహించుకుంటూ… చివరికి తన ఆఫీస్ లోని అమాంయితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకునే పాత్రలో నాగార్జున నటన, అయన కామెడీ అద్భుతం. అమ్మాయిలతో డాన్స్ లు చేస్తూ మందు కొడుతూ జీవితాన్ని ఆనందంగా గడిపెయ్యాలనుకుంటాడు. ఇప్పుడు మన్మధుడు 2 లో కూడా నాగార్జున ప్లే బాయ్ పాత్రలోనే మెరిశాడు. అసలు సినిమా పేరు పెట్టడానికి నాగార్జున పాత్రే ముఖ్య కారణం. ఇక మొదటి సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ ని పిలిచి నాగ్ అవకాశమిచ్చాడంటే..అందరూ కాస్త ఆలోచించారు. మన్మధుడు సినిమా పేరుని ఈ సీక్వెల్ తో రాహుల్ చెడగొట్టాడు కదా అనుకున్నారు. అయితే మన్మధుడు 2 లో నాగ్ నిజంగానే మన్మథుడిలా కనిపించినా… మన్మధుడు కామెడీతో పోలిస్తే మన్మధుడు 2 లో మోతాదు కాస్త తగ్గింది. నాగ్ ప్లేబాయ్ అవతారం, వెన్నెల కిషోర్ కామెడీ, అవంతికగా రకుల్ చేసే సందడితో ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో కామెడీ మాత్రం ఆశించిన స్థాయిలో పండలేదు. అయితే ఫస్టాఫ్ ఫన్ రైడ్‌లో నాగ్ రొమాన్స్ A సర్టిఫికేట్ సినిమాను తలిపించినప్పటికీ….. కామెడీని జోడించడంతో ఇబ్బందికరంగా అనిపించదు. ఇక డబుల్ మీనింగ్ డైలాగ్‌లు హర్ట్ అయ్యేలా కాకుండా కాస్త హాస్యం పండేవిగానే ఉన్నాయి. ఫస్టాఫ్ మొత్తం చాలా సాఫీగా ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌తో సెంకడాఫ్లోకి తీసుకువెళ్లిన దర్శకుడు ఆ ఫ్లోను కంటిన్యూ చేయలేకపోయారు. తరువాత కథ ఏం జరగబోతుందో ఇంటర్వెల్లోనే రివీల్ కావడంతో కథ స్లో అవుతుంది. ఇక క్లైమాక్స్ కూడా నాటకీయంగానే ముగియడం మన్మధుడు 2 కథలో లోటు. చి.ల.సౌ లో సహజంగా, కథలో నుంచే రాహుల్ రవీంద్రన్ వినోదాన్ని రాబట్టారు. కానీ ఈ చిత్రంలో అది లోపించింది. కాకపోతే రాహుల్ రవీంద్రన్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాని తీర్చిదిద్దిన విధానం పర్వాలేదనిపిస్తుంది.
సాంకేతికంగా…
చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుండటమే కాకుండా.. ఆ సాంగ్స్‌ని సందర్భానుసారంగా వాడుకున్నారు. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. సుకుమార్ కెమెరా సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది. సినిమా మొత్తాన్ని పోర్చుగల్‌లో షూట్ చేయడం వల్ల చాలా రిచ్‌గా అనిపిస్తుంది. విదేశీ అందాలు మెస్మరైజ్ చేస్తాయి. పోర్చుగల్ అందాలతో పాటు నాగార్జునను, రకుల్‌ను చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్: నాగార్జున నటన, వెన్నెల కామెడీ, రకుల్ నటన, గ్లామర్, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: క్లైమాక్స్, సాంగ్స్, కామెడీ, సెకండ్ హాఫ్
రేటింగ్: 2.25 /5