మోదీ ఆ పని చేసినా…? బైడెన్ మాత్రం?
భారత్ కు విపత్కర సమయంలో అనేక దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రధానంగా అమెరికా భారత్ కు బాసటగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయిన [more]
భారత్ కు విపత్కర సమయంలో అనేక దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రధానంగా అమెరికా భారత్ కు బాసటగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయిన [more]
భారత్ కు విపత్కర సమయంలో అనేక దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రధానంగా అమెరికా భారత్ కు బాసటగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయిన తర్వాత భారత్ తో సత్సంబంధాలు పెద్దగా ఉండవని అందరూ భావించారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలవడమే ఇందుకు కారణం.
ట్రంప్ కు మద్దతుగా….
అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ట్రంప్ కు మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అందరూ భావించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కు అండగా నిలిచారు. హౌడీ మోడీ పేరుతో అమెరికాలో సభలు పెట్టి ట్రంప్ కు మద్దతు తెలిపారు. అదే సమయంలో ట్రంప్ భారత్ కు వచ్చి ఇక్కడ సమావేశం పెట్టి అమెరికాలోని భారతీయుల మద్దతు పొందేందుకు ప్రయత్నించారు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా…..
కానీ ఫలితాలు మోదీ అంచనాలకు భిన్నంగా సాగాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక కావడంతో భారత్ ను శత్రువుగా పరిగణించకపోయినప్పటికి పెద్దగా సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు. ట్రంప్ తరహాలో భారత్ కు మద్దతు లభిస్తుందనుకోవడం అవాస్తవం. అయితే అమెరికాలోని భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జోబైడెన్ చర్యలు తీసుకుంటుండటం కొంత సానుకూలంగానే ఉంది.
భారత్ కు అండగా…..
ఈనేపథ్యంలో కరోనా విపత్కర సమయంలో జోబైడెన్ భారత్ కు అండగా నిలిచారు. ఈ ఆపత్కాల సమయంలో భారత్ కు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడిసరుకును పంపుతున్నట్లు అమెరికా ప్రకటించింది. మోదీ ముందు చూపు లేకుండా ట్రంప్ కు మద్దతు ప్రకటించినా, జో బైడెన్ భారత్ కు సహకారం అందించడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది.