క్లీన్ ఇమేజ్ ఉన్నా వీళ్లంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరట
అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వచ్చే ఎన్నికల నాటి కి రిటైర్మెంట్ స్టేజ్‌కు దగ్గర పడుతున్నారు. వాస్తవానికి రిటైర్మెంట్ అనేది [more]
అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వచ్చే ఎన్నికల నాటి కి రిటైర్మెంట్ స్టేజ్‌కు దగ్గర పడుతున్నారు. వాస్తవానికి రిటైర్మెంట్ అనేది [more]
అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వచ్చే ఎన్నికల నాటి కి రిటైర్మెంట్ స్టేజ్‌కు దగ్గర పడుతున్నారు. వాస్తవానికి రిటైర్మెంట్ అనేది రాజకీయాలకు లేకపోయినా.. వృద్దాప్యం, ఇతరత్రా.. ఆరోగ్య సమస్యల కారణంగా.. ఇప్పటికే దూకుడు ప్రదర్శించలేని పరిస్థితిలో ఉన్నవారంతా.. తమంతటతామే.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పి .. కేవలం సలహాదారులుగా ఉండాలని భావిస్తున్నారు. ఈ వరుసలో టీడీపీలో బుచ్చయ్య చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బుచ్చయ్య ఇప్పటకే ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతోన్న ప్రతి ఎన్నికల్లోనూ ఆయన గెలుస్తూ వస్తున్నారు.
రెండు పార్టీల్లో…..
అదే సమయంలో నెల్లూరు కు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఈ క్యూలోనే ఉన్నారని సమాచారం. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ప్రస్తుతం వైసీపీకి మద్దతు దారుగా ఉన్న కరణం బలరాం.. వంటివారు రిటైర్మెంట్కు దగ్గరయ్యారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. నూజివీడు ఎమ్మెల్యే వెంకట అప్పారావు, మంత్రి రంగనాథరాజు పేర్లు రిటైర్మెంట్ జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే.. వీరితర్వాత ఎవరు రాజకీయాల్లోకి వస్తారు.? అనేది పక్కన పెడితే.. ఇలాంటి వారు మాత్రం రావడం కష్టమేనని అంటున్నారు.
క్లీన్ ఇమేజ్ ఉన్నా…
రిటైర్మెంట్ అవుతున్నవారిలో చాలా మందికి క్లీన్ ఇమేజ్ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు అనేక మార్లు విజయం సాధించిన వారితోపాటు.. సుదీర్ఘకాలంగా ఒకే పార్టీలో ఉన్నవారు.. ఒకే పార్టీని, నాయకుడిని నమ్ముకున్నవారు కూడా ఈ రిటైర్మెంట్ల జాబితాలో ఉండడం ఆసక్తిగా మారింది. బుచ్చయ్య, సోమిరెడ్డి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడూ పార్టీ మారలేదు. వీరిలో సోమిరెడ్డి వారసుడు ఇప్పటికే లైన్లో ఉండగా.. బుచ్చయ్య తన సోదరుడి వారసుడిని తెరమీదకు తెస్తున్నారు.
అనివార్యమేనా?
అదేసమయంలో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకు చేరువైన వారు కూడా ఉన్నారు. దీంతో ఇలాంటివారు మళ్లీ రాజకీయాల్లోరావడం కష్టమనే వాదన ఉంది. కానీ.. వీరికి ఇప్పుడున్న పరిస్థితితోపాటు.. కొందరుతమ వారసుల కోసం పక్కకు తప్పుకొంటుండగా.. మరికొందరిని పార్టీలే తప్పిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకంగా మారడం.. పోటీ కూడా అంతే రేంజ్లో ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి రిటైర్మెంట్ అనివార్యంగా మారింది. మరి వీరి ప్లేస్‌లోకి ఎవరెవరు వస్తారు ? ఏం జరుగుతుంది ? అనేది భవిష్యత్తు డిసైడ్ చేయనుంది.