ఇలా కలిశారో లేదో … మళ్లీ మొదటికొచ్చింది
రాజమండ్రి వైసీపీ లో గ్రూప్ ల ఆధిపత్య పోరుకు ఒక రోజు మాత్రమే చెక్ పెట్టింది అధిష్టానం. కట్ చేస్తే పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ [more]
రాజమండ్రి వైసీపీ లో గ్రూప్ ల ఆధిపత్య పోరుకు ఒక రోజు మాత్రమే చెక్ పెట్టింది అధిష్టానం. కట్ చేస్తే పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ [more]
రాజమండ్రి వైసీపీ లో గ్రూప్ ల ఆధిపత్య పోరుకు ఒక రోజు మాత్రమే చెక్ పెట్టింది అధిష్టానం. కట్ చేస్తే పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ ఫ్లెక్సీ గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది పార్టీ ప్రత్యర్థుల పనా …? లేక సొంత పార్టీలోని గ్రూప్ ల పనా అనే చర్చ మొదలైంది. ఫ్లెక్సీ చించివేత వ్యవహారం చిన్నదైనా ఎంపి దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో బాటు నిందితులెవరన్నది తేల్చాలని డిమాండ్ చేయడంతో హాట్ హాట్ రాజకీయాలు మొదలయ్యాయి.
కొత్త సంప్రదాయాలకు …
గోదావరి జిల్లాల్లో గత కొంత కాలంగా ఈ ఫ్లెక్సీ వివాదాలు బాగా పెరిగిపోయాయి. సినీ హీరోల అభిమానుల నడుమ ఈ గొడవలు బాగా నడిచేవి. అయితే ఇప్పుడు వీటి స్థానంలో పొలిటికల్ హీరో లు ఫ్లెక్సీ లు ఎక్కుతున్నారు. దాంతో ఫ్లెక్సీ ల ఏర్పాటు నుంచి చించివేత వరకు ఒకటే వివాదాలు మొదలు అయిపోయాయి. దీనితో బాటు ప్రధాన పార్టీల నడుమ ఫ్లెక్సీ ల హడావిడి అంతా ఇంతా కాదు. ఈ బాధ పడలేక గతంలో ప్రభుత్వం ఫ్లెక్సీ లు అనుమతి లేకుండా పెడితే భారీ జరిమానా విధించేవారు. అయితే ఇటీవల మళ్ళీ ఫ్లెక్సీ ల గోల పెరిగిపోయింది.
ఫ్లెక్సీ ల పోటీ వివాదాలకు తెరతీస్తోంది…..
పోటాపోటీగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆ తరువాత ఏ అర్ధరాత్రో ఆకతాయిలెవరో చించేయడం తగులబెట్టడం అక్కడి నుంచి నానా గొడవ మొదలు కావడం రివాజు అయిపొయింది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గతంలో లాగే అనుమతులు లేని ఫ్లెక్సీలపై జరిమానాలు విధించడంతో పాటు ఇవి ఏర్పాటు చేసేవారు సొంత ఖర్చుతోనే సిసి కెమెరా ఖర్చును సైతం భరించేలా సర్కార్ చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఈ సంప్రదాయం చెక్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.