Ycp : ఈయనకు మంత్రి అయ్యే ఛాన్సే లేదట
వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే మర్రి రాజశేఖర్ అనే చెప్పాలి. ఆయనకు వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. మూడేళ్లుగా ఎమ్మెల్సీ పదవే [more]
వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే మర్రి రాజశేఖర్ అనే చెప్పాలి. ఆయనకు వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. మూడేళ్లుగా ఎమ్మెల్సీ పదవే [more]
వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే మర్రి రాజశేఖర్ అనే చెప్పాలి. ఆయనకు వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. మూడేళ్లుగా ఎమ్మెల్సీ పదవే దక్కలేదు. ఎమ్మెల్సీ పదవిని జగన్ మర్రి రాజశేఖర్ కు ఖచ్చితంగా ఇస్తారని భావించారు. కానీ అనేక సార్లు ఎమ్మెల్సీ పోస్టుల భర్తీ చేసే అవకాశం వచ్చినా తాడేపల్లికి పక్కనే ఉన్న మర్రి రాజశేఖర్ వైపు మాత్రం జగన్ చూడలేదు.
తొలినుంచి…
మర్రి రాజశేఖర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత అయినా తొలి నుంచి యాంటీ టీడీపీగా ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు మంచి ప్రాధాన్యత లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 2004లో ఆయన చిలకలూరి పేటకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత వరసగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ టిక్కెట్ ను జగన్ ఇచ్చినా కూడా గెలవలేకపోయారు.
టిక్కెట్ ఇవ్వకపోయినా….?
అయితే 2019 ఎన్నికలలో మర్రి రాజశేఖర్ కు టిక్కెట్ ఇవ్వకుండా విడదల రజనీకి టిక్కెట్ ఇచ్చారు. టిక్కెట్ తనకు ఇవ్వకపోయినా వైసీపీ విజయం కోసం పనిచేశారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని జగన్ నాడు హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీ పదవి ఇంతవరకూ జగన్ ఇవ్వకపోవడంతో ఆయన క్యాడర్ లో అసంతృప్తి నెలకొంది. కేవలం సామాజికవర్గాన్ని చూసే జగన్ దూరం పెడుతున్నారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
ఎమ్మెల్సీ పదవిని….
జగన్ మాత్రం ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకుంటే ఇప్పుడు మంత్రి పదవి రావడం మాత్రం కష్టమే. ఎమ్మెల్సీలకు మంత్రి పదవి ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని జగన్ తీసేసుకున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ ప్రతిపాదించడం, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఇక ఎమ్మెల్సీలకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదు. దీంతో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందేమో కాని, మంత్రి పదవి మాత్రం రాదు.