Ys jagan : ఈయనంటే ఇష్టంలేదా? ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు?
ఎందుకో జగన్ కు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇష్టం లేనట్లు కన్పిస్తుంది. చేసిన త్యాగాలకు ఫలితం లేకుండా పోయింది. కమ్మ సామాజికవర్గమయినా వైసీపీనే నమ్ముకుని రాజకీయాలు [more]
ఎందుకో జగన్ కు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇష్టం లేనట్లు కన్పిస్తుంది. చేసిన త్యాగాలకు ఫలితం లేకుండా పోయింది. కమ్మ సామాజికవర్గమయినా వైసీపీనే నమ్ముకుని రాజకీయాలు [more]
ఎందుకో జగన్ కు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇష్టం లేనట్లు కన్పిస్తుంది. చేసిన త్యాగాలకు ఫలితం లేకుండా పోయింది. కమ్మ సామాజికవర్గమయినా వైసీపీనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న మర్రి రాజశేఖర్ కు ఈసారి కూడా మొండిచేయి చూపించారు. అసలు మర్రి రాజశేఖర్ విషయంలో ఎందుకింత విముఖత చూపుతున్నారు? ఆయనపై ఆగ్రహంతో ఉన్నారా? లేదా మరో పదవి కోసం ఇప్పుడు ఆపారా? అన్నది చర్చనీయాంశమైంది.
తొలి నుంచి అండగా….
గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం నుంచి తొలి నుంచి వైసీపీకి అండగా నిలబడింది మర్రి రాజశేఖర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఆయన ఆ కుటుంబానికి నమ్మకంగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ విజయం కోసం పనిచేశారు మర్రి రాజశేఖర్. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు కూడా.
ప్రచారానికే పరిమితం…?
కానీ ఎన్ని సార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేసిినా మర్రి రాజశేఖర్ పేరు కేవలం ప్రచారంలోనే ఉంటుంది. గతంలో గవర్నర్ కోటాలో భర్తీ చేస్తారనుకున్నా పక్కన పెట్టారు. కానీ ఈసారి 11 మంది స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానుండటంతో ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ కు పదవి వస్తుందని భావించారు. కానీ ఈసారి కూడా మర్రికి పదవి దక్కలేదు. మూరుగుడు హన్మంతరావుకు ఈ ఎమ్మెల్సీ పదవి దక్కింది.
అడ్డుకుంటుంది ఎవరు?
మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మర్రి రాజశేఖర్ కు, విడదల రజనీల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. ఈ పరిస్థితుల్లో రజనీ ఏమైనా అడ్డుకున్నారా? అన్న చర్చ జరుగుతుంది. కానీ జగన్ ఒకసారి మాట ఇస్తే తప్పరని, రజనీ లాంటి వాళ్లు అడ్డుపడినా ఆగే అవకాశం లేదని అనేవాళ్లు కూడా లేకపోలేదు. మొత్తం మీద మర్రి రాజశేఖర్ కు ఈసారి కూడా జగన్ మొండి చేయి చూపించారు. ఎటువంటి హామీ ఇవ్వని కమ్మ సామాజికవర్గానికి చెందిన తూమాటి మాధవరావు, తలశిల రఘురాంకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.