మర్రికి మాట.. గెలుపు జగన్‌దా… రజనీదా..!
మర్రి రాజశేఖర్ గుంటూరు జిల్లా రాజకీయాల్లో చిన్న వివాదం లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తోన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. దివంగత సోమేపల్లి సాంబయ్య రాజకీయ వారసుడిగా [more]
మర్రి రాజశేఖర్ గుంటూరు జిల్లా రాజకీయాల్లో చిన్న వివాదం లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తోన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. దివంగత సోమేపల్లి సాంబయ్య రాజకీయ వారసుడిగా [more]
మర్రి రాజశేఖర్ గుంటూరు జిల్లా రాజకీయాల్లో చిన్న వివాదం లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తోన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. దివంగత సోమేపల్లి సాంబయ్య రాజకీయ వారసుడిగా చిలకలూరిపేట రాజకీయాల్లోకి వచ్చిన మర్రి రాజశేఖర్ 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ నుంచి ఓడిన ఆయన జగన్ వైసీపీ పెట్టిన వెంటనే ఆ పార్టీలోకి వెళ్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లోనూ ఓడిన మర్రికి ఆ తర్వాత రాజకీయంగా కాలం కలిసి రాలేదు. అప్పటి వరకు టీడీపీలో ఉండి ఆ పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ విడదల రజనీ వైసీపీలోకి రావడం.. జగన్ ఆర్థిక కోణాల నేపథ్యంలో సీటు దక్కించుకోవడం జగన్ గాలిలో ఆమె గెలవడం చకచకా జరిగిపోయాయి.
సీటు త్యాగం చేసినా…..
సీటు త్యాగం చేసినందుకు మర్రి రాజశేఖర్ కు జగన్ చిలకలూరిపేట అసెంబ్లీ ప్రచారంలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ఇచ్చి.. జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతోంది. ఇప్పటి వరకు మర్రి రాజశేఖర్ ను వైసీపీ అధిష్టానం పట్టించుకున్న పాపాన పోలేదు. మధ్యలో జగన్ ఎన్నో ఎమ్మెల్సీలను భర్తీ చేశారు. చివరకు ఎన్నికలకు ముందు పార్టీలు మారిన పండు రవీంద్రబాబు లాంటి వాళ్లకు సైతం ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ రాజశేఖర్‌ను పట్టించుకోలేదు. చివరకు ఎన్నికల తర్వాత మాట ఇవ్వని వారికి కూడా జగన్ ఎమ్మెల్సీలు ఇచ్చేశాడు. మధ్యలో ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లినా.. సామాజిక సమీకరణలు అంటూ ఆ వర్గం ఎమ్మెల్యేలకే ఆ మంత్రి పదవులు కట్టబెట్టడంతో మర్రి రాజశేఖర్ కు ఏ ఆశా తీరడం లేదు.
రజనీయే అడ్డు పుల్లా…?
వాస్తవానికి ఎన్నికలకు ముందు రాజశేఖర్‌ను తప్పించి.. రజనీకి సీటు ఇచ్చినప్పటి నుంచే రెండు వర్గాల మధ్య సఖ్యత లేదు. మర్రి రాజశేఖర్ మాత్రం ఎన్నికల ప్రచారంలో రజనీకి గెలుపుకోసం కృషి చేశారు. అయితే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రజనీ రాజశేఖర్ యాక్టివ్ అయినా, ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి వచ్చినా నియోజకవర్గంలో తన పట్టు ఎక్కడ సడలిపోతుందో ? అని ఆయన్ను పూర్తిగా సైడ్ చేసిన వాతావరణమే పేటలో కనిపిస్తోంది. ఆర్థిక బలం అండతో రజనీ పార్టీ ముఖ్యులు, కీలక నేతలతో పరిచయాలు పెంచుకుని పార్టీలో బీసీ మహిళా నేతగా దూసుకుపోయింది.
వైరి పక్షం సక్సెస్ అయిందని….?
బలమైన వాయిస్ ఉన్న బీసీ మహిళా నేత కావడం, ఇటు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉండడంతో రజనీ హవా నడుస్తోంది. ఆమె ఒత్తిళ్ల వల్లే మర్రి రాజశేఖర్ కు పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటకీ ఎలాంటి పదవీ రాలేదని అంటున్నారు. మర్రి రాజశేఖర్ పార్టీ కోసం ఎంత కష్టపడినా ఆయన కష్టాన్ని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో కూడా ఆయన వ్యతిరేక వర్గం సక్సెస్ అయ్యిందన్న గుసగుసలు కూడా పార్టీలో ఉన్నాయి. వాస్తవంగా వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న ఆయనే పేటలో పార్టీని నిలబెట్టారు.
మాట ఇచ్చి తప్పుతారా?
మర్రి రాజశేఖర్ తో పాటు 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వాళ్లంతా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఇతర కీలక పదవుల్లో ఉంటే ఆయనకు రజనీ రూపంలో సొంత పార్టీలోనే దెబ్బపడింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో పాటు ప్రభుత్వంలో కీలక వ్యవహారాలు చక్క పెట్టే ఓ నేతతో రజనీ చేస్తోన్న లాబీయింగే మర్రి రాజశేఖర్ కు ఇబ్బందిగా మారిందని టాక్ ? ఈ వార్‌లో రాజశేఖర్‌కు ఎలాంటి పదవులు రాకుండా చేయడంలో రజనీ సక్సెస్ అవుతుందా ? లేదా జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మరో ఏడెనిమిది నెలల్లో జరిగే ప్రక్షాళనలో అయినా మంత్రి పదవి ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాడా ? అన్నది చూడాలి.