మర్రికి మళ్లీ హ్యాండే….అడ్డుపడుతోన్న శక్తి ఎవరు ? ?
దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే, దివంగత వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత మర్రి రాజశేఖర్. [more]
దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే, దివంగత వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత మర్రి రాజశేఖర్. [more]
దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే, దివంగత వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత మర్రి రాజశేఖర్. తొలుత కాంగ్రెస్‌లోను, తర్వాత వైసీపీలోను చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా మర్రి ఫ్యామిలీ ఐదు దశాబ్దాలుగా రాజకీయం చేస్తోంది. వైఎస్ తర్వాత మర్రి రాజశేఖర్ జగన్ కు కూడా సన్నిహితంగా మారారు. వైసీపీ ఆవిర్భవించిన వెంటనే ఆ పార్టీలోకి వెళ్లి నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా సుధీర్ఘకాలం ఉన్నారు. గత 2019 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన ఆయనను కాదని.. బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజనీ అనే కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఇచ్చి.. తన కేబినెట్లో మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకూ పట్టించుకోకపోవడంతో….
అయితే మర్రి రాజశేఖర్ ని ఇప్పటి వరకు జగన్ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అనేక మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా.. మర్రిని కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాజాగా ఆరుగురు శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అర్హులు అయ్యారు. మొన్న కూడా మొక్కూ మొఖం తెలియని జకీయ ఖానూన్ లాంటి వాళ్లను ఎమ్మెల్సీని చేశారు. ఇక తాజాగా ఆరు ఎమ్మెల్సీలు భర్తీ అవ్వడంతో ఆది నుంచి మర్రి రాజశేఖర్ పేరు ఉంటుందని అందరూ అనుకున్నారు. తీరా.. జాబితా వచ్చాక.. మర్రి రాజశేఖర్ పేరు మచ్చుకైనా కనిపించలేదు. పైగా వీరిలో ఇస్తానని హామీ ఇచ్చినవారు కూడా పెద్దగాలేరుకానీ, వారికి ఖరారైంది.
పార్టీ కోసం పనిచేసినా….?
కానీ, అదేసమయంలో అత్యంత కీలకమైన.. మర్రి రాజశేఖర్ విషయాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావిం చలేదు. దీని వెనుక ఏం జరిగిందనేది హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి మర్రి రాజశేఖర్ పార్టీ కోసం పనిచేశారు. జగన్ పార్టీ పెట్టగానే చేరి.. కష్టపడ్డారు. పార్టీ పెట్టాక జిల్లాలోనే పార్టీ పటిష్టత కోసం మర్రి రాజశేఖర్ ఎంతో కృషి చేశారు. గత ఎన్నికల్లో రజనీ గెలుపు కోసం కృషి చేశారు. క్లీన్ ఇమేజ్ ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్సీ అయినా.. మర్రిని మాత్రం పట్టించుకోలేదు. నిజానికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గాన్నిఆకర్షించాలంటే.. మర్రికి ఛాన్స్ ఇవ్వాలనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదు? అనే విషయాన్ని పరిశీలిస్తే.. మర్రిపై వ్యతిరేక లాబీయింగ్ జోరుగా పనిచేస్తోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
బలమైన లాబీయింగ్…
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ.. ఓ సలహాదారుడికి పదేపదే ఇచ్చిన ఫిర్యాదులు పనిచేస్తున్నాయని తెలుస్తోంది. మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఇచ్చి. మంత్రి పదవి ఇస్తే.. నియోజకవర్గంలో తన ప్రాధాన్యం తగ్గుతుందని.. విడదల ఆది నుంచి ఫిర్యాదులు చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఎన్నికలకు ముందు వరకు ఆయనతో కలిసి డాడీ డాడీ అంటూ తిరిగిన ఆమె ఎన్నికలు అయిన మరుక్షణం నుంచే పక్కన పెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదని, పైగా మర్రి రాజశేఖర్‌కు పట్టున్న చోట్ల కూడా ఓట్లు రాలేదని ఆమె చేసిన ఫిర్యాదుల వల్లే.. మర్రిపై ఇలా ఉదాశీనత కనిపిస్తోందా ? అనేది తేలాల్సి ఉంది.
వచ్చే విడతలోనైనా…?
ఇక ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ వీరిద్దరి గ్యాప్‌తో రజనీకి ఎదురు దెబ్బ తగిలింది. పోనీ జగన్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ కమ్మ నేతకూ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మర్రి రాజశేఖర్‌ను కాదని మరో వ్యక్తికి ఇచ్చే ఆలోచన కూడా చేయకపోవచ్చు. మరో ఐదారు నెలల్లో మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉన్నాయి. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఫైనల్‌గా జూన్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలే ఉన్నాయి. మరి జగన్ అప్పుడైనా మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారేమో ? చూడాలి.