ఆశలు పెంచారే
కొద్దోగొప్పో మాయావతి కాంగ్రెస్ నేతల్లో కొంత ఆశలు కల్పించారు. మాయావతి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. మాయావతి మూడ్ ను బట్టి వ్యవహరిస్తుంటారన్నది బహుజన్ సమాజ్ [more]
కొద్దోగొప్పో మాయావతి కాంగ్రెస్ నేతల్లో కొంత ఆశలు కల్పించారు. మాయావతి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. మాయావతి మూడ్ ను బట్టి వ్యవహరిస్తుంటారన్నది బహుజన్ సమాజ్ [more]
కొద్దోగొప్పో మాయావతి కాంగ్రెస్ నేతల్లో కొంత ఆశలు కల్పించారు. మాయావతి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. మాయావతి మూడ్ ను బట్టి వ్యవహరిస్తుంటారన్నది బహుజన్ సమాజ్ పార్టీలోనే విన్పించే మాట. అలాంటి మాయావతి ఏ పార్టీకి మద్దతిస్తారన్నది స్పష్టంగా చెప్పలేం. అలాంటి మాయావతి కాంగ్రెస్ కు ఊరట కల్గించే చర్యలు చేపట్టారు. కర్ణాటకలో బీఎస్పీ సభ్యుడు మహేష్ ను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు.
బీఎస్పీ సభ్యుడి బహిష్కరణతో….
కర్ణాటకలో మాయావతి సంకీర్ణ సర్కార్ కు మద్దతు పలికారు. కాంగ్రెస్,జేడీఎస్ లతో కలసి ఏర్పాటయిన సంకీర్ణ సర్కార్ కు బీఎస్పీ సభ్యుడు మహేష్ మద్దతివ్వాలని కోరారు. కుమారస్వామి విశ్వాస పరీక్షకు హాజరవ్వాలని మాయావతి ఆదేశించారు. కానీ మాయావతి ఆదేశాలను బేఖాతరు చేసిన మహేష్ విశ్వాస పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో మాయావతి మహేష్ ను బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఇంతకీ మహేష్ బహిష్కారానికి, కాంగ్రెస్ ఆనందానికి లింకేంటంటి? అని అనుమానం వచ్చిందా?
మధ్యప్రదేశ్ లోనూ…..
అందుకు పెద్ద కారణమే ఉంది. కర్ణాటక ఎపిసోడ్ తర్వాత భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ పై కన్నేైసింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ లో చీలిక తెచ్చి తాము అధికారంలోకి రావాలని భావిస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీఎస్పీ సభ్యుడు మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఎస్పీ సభ్యుడు మద్దతు ఉపసంహరిస్తే కాంగ్రెస్ సర్కార్ కు కష్టకాలమే. ఒకవేళ మధ్యప్రదేశ్ లోనూ కర్ణాటక తరహా పరిస్థితులు ఏర్పడితే మాయావతి తమకు అండగా నిలుస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
తమకే మద్దతు ఉంటుందని…..
కర్ణాటకలో అక్కడి పార్టీ ఎమ్మెల్యేపై వేటు వేయడంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీఎస్పీ సభ్యులు కొంత భయపడతారని కాంగ్రెస్ భావిస్తోంది. మాయవతి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇవ్వరు కాబట్టి తమ పక్షానే ఉంటారని చెప్పడానికి కర్ణాటక సభ్యుడి బహిష్కరణ ఉదాహరణ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీఎస్పీ సభ్యులు కీలకం కావడంతో మాయావతి పైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.