మీసాల రోషం బాబు చూస్తారా ?
రొయ్యకైనా మీసం ఉంటుంది కానీ పౌరుషం చూపాలి కానీ అని ఒక మాట ఉంది. అయితే ఆ ఇంటి పేరే మీసాల ఇక రోషాలకు కొదవేముంది. అందుకే [more]
రొయ్యకైనా మీసం ఉంటుంది కానీ పౌరుషం చూపాలి కానీ అని ఒక మాట ఉంది. అయితే ఆ ఇంటి పేరే మీసాల ఇక రోషాలకు కొదవేముంది. అందుకే [more]
రొయ్యకైనా మీసం ఉంటుంది కానీ పౌరుషం చూపాలి కానీ అని ఒక మాట ఉంది. అయితే ఆ ఇంటి పేరే మీసాల ఇక రోషాలకు కొదవేముంది. అందుకే సరైన బస్తీ మే సవాల్ అంటూ ఓవైపు రాచ కుటుంబానికి మరో వైపు చంద్రబాబుకు కూడా ఆమె సవాల్ చేస్తున్నారు విజయనగరం జిల్లా టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తన రూటే సెపరేటూ అంటున్నారు. ఆమె మొదట పోటీ చేసిందే రాజుల మీద. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున మీసాల గీత పోటీ పడి నాటి టీడీపీ అభ్యర్ధి అశోక్ గజపతిరాజుకు చుక్కలు చూపించారు. ఓడినా పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించారు. దానికి ఆమె కుటుంబ నేపధ్యంతో పాటు బలమైన కాపు సామాజికవర్గం కూదా ప్రధాన కారణం.
గెలిచి నిలిచినా….
ఇక 2014 నాటికి మీసాల గీత తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుతో పాటే టీడీపీలో చేరిపోయారు. ఆమెకు టికెట్ దక్కేలా గంటా చక్రం తిప్పారు. ఈ దెబ్బకు అశోక్ లోక్ సభకు పోటీ చేయాల్సివచ్చింది. తన రాజకీయ పట్టు ఎక్కడ జారిపోతుందోనని అశోక్ వేలూ కాలూ పెడుతున్నా విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆయన్ని దాటుకుని మరీ మీసాల గీత ముందుకు వెళ్ళారు. దానికి ఇంచార్జి మంత్రి హోదాలో నాడు గంటా కూడా సహకరించారు. ఇక 2019 ఎన్నికల నాటికి మాత్రం అశోక్ పట్టుబట్టి మరీ తన కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ తెచ్చుకున్నారు. కానీ ఆమె ఓడిపోయింది. దాని వెనక కూడా మీసాల గీత మద్దతుదారులు ఉన్నారని ప్రచారం అయితే సాగింది.
సొంత దుకాణమేనా…?
ఇక అతిది ఓడిన తరువాతనైనా ఆమెను పక్కన పెట్టి తనకు నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు చంద్రబాబు అప్పగిస్తారని మీసాల గీత చూసినా ఉపయోగం లేకపోయింది. ఈ విషయంలో విన్నపాలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో నాటి నుంచి ఆమె పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. సొంతంగా పార్టీ ఆఫీస్ తెరచి తన మద్దతుదారులతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయనగరంలో పెద్ద ఎత్తున తూర్పు కాపులు ఉన్నారని, అయినా తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఆమె గీత దాటేందుకు కూడా రెడీ అవుతున్నారని అంటున్నారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు పార్టీ పెద్దల ద్వారా రాయబారాలు నడిపినా మీసాల గీత దిగిరాకపోవడంతో ఆమె రాజకీయం మీద టీడీపీలో చర్చ సాగుతోంది.
వైసీపీలోకేనా…?
ఇక మీసాల గీత చూపులు వైసీపీ మీద ఉన్నాయని అంటున్నారు. ఆమె కనుక వైసీపీలోకి రావాలంటే 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సిందే. ఈ కండిషన్ కి అంగీకరిస్తేనే తాను పార్టీలోకి వస్తానని ఆమె అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంటున్నారు. ఆయన తన కుమార్తెను కానీ అల్లుడిని కానీ వారసులుగా ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే వారితో పోల్చితే బలమైన సామాజికవర్గానికి చెందిన మీసాల గీత బెటర్ అని వైసీపీలో వినిపిస్తున్న టాక్. జిల్లాకు చెందిన మంత్రి బొత్స కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. దాంతో మీసాల గీత వైసీపీలో చేరడం ఖాయమే అంటున్నారు. అదే కనుక జరిగితే అశోక్ కూతురు అదితికి మళ్ళీ గట్టి పోటీ తప్పదంటున్నారు.