ఈ రాజావారు అలిగారే.. పదవుల వ్యవహారమే కారణమా..?
కృష్ణాజిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న వైసీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు.. పార్టీపై అలిగారా? వైసీపీ [more]
కృష్ణాజిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న వైసీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు.. పార్టీపై అలిగారా? వైసీపీ [more]
కృష్ణాజిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న వైసీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు.. పార్టీపై అలిగారా? వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యవహార శైలిపై ఒకింత ఆగ్రహం, అసహనంతో ఉన్నారా ? అంటే.. ఇదే విషయం తమకు కూడా అంతు చిక్కడం లేదని అంటున్నారు వైసీపీ నాయకులు. పార్టీకోసం ఎంతో శ్రమించిన నాయకుడిగా.. జగన్ దగ్గర మంచి మార్కులు ఉన్ప ప్రతాప్.. నూజివీడు జమీందార్ మేకా రాజారంగయ్యప్పారావు వారసుడిగా రాజకీయ రంగంలోకి దిగారు. సుదీర్ఘరాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీగా జిల్లాలో పేరు తెచ్చుకున్న ఈ కుటుంబం దానాలు, ధర్మాల్లోనూ చరిత్రను సృష్టించింది. ఆదిలో 1955లోనే కాంగ్రెస్ రాజకీయాల్లో మేకా కుటుంబం చక్రం తిప్పింది.
వైఎస్ కు అత్యంత సన్నిహితులుగా….
1999 వరకు టీడీపీలోనే ఉన్న మేకా ప్రతాప్ అప్పారావు ఆ ఎన్నికల్లో టీడీపీ సీటు రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 40 వేల ఓట్లు తెచ్చుకుని ఏకంగా రెండో స్థానంలో నిలిచారు. 2004లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆయన తన సామాజిక వర్గానికి చెందిన కేవీపీ రామచంద్రరావు జోక్యంతో నూజివీడు సీటు సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన దివంగత వైఎస్‌కు అనుచ రుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో వాస్తవానికి వైఎస్ హవా వీచినప్పటికీ.. ఇక్కడ మేకా ప్రతాప్ అప్పారావు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక, ఆ తర్వాత మారిన రాజకీ య సమీకరణల నేపథ్యంలో ప్రతాప్ అప్పారావు.. కాంగ్రెస్‌ను వీడి. వైసీపీలోకి చేరారు. జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరుతె చ్చుకున్నారు.
నామినేటెడ్ పదవి కూడా….
నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టేందుకు అహరహం శ్రమించారు. 2014లోను, 2019లోను వైసీపీ తరఫున విజయం సాధించారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు మద్దతుగా యజ్ఞాలు, యాగాలు చేయించారు. ఇలా పార్టీ కోసం ఎంతో కృషి చేసిన తనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలమైన వెలమ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన అనుచరులతో నూ చెప్పేవారు. కానీ, మంత్రి పదవి పక్కన పెడితే.. నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ తర్వాత నూజివీడులో పార్టీ ఏదైనా కూడా వెలమల ఆధిపత్యమే కొనసాగుతూ వచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ, ఏపీలో ఈ కోటాలో మంత్రి పదవి ఖచ్చితంగా ఉండేది. చంద్రబాబు సైతం ఈ వర్గానికి చెందిన సుజయ్ కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో…..
ఇప్పుడు జగన్ మాత్రం ఈ వర్గానికి కేబినెట్లో చోటు ఇవ్వలేదు. కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడంతో హర్ట్ అయిన మేకా ప్రతాప్ అప్పారావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడూ.. మీడియా ముందు ఉండే.. ఆయన దాదాపు ఆరేడు మాసాలుగా మీడియా వంక కూడా చూడడం లేదు. వైసీపీపై ఈగ కూడా వాలనివ్వని నాయకుడిగా పేరున్న మేకా.. ఒక్కసారిగా మౌనం పాటించడంపై నియోజకవర్గంలోనూ చర్చ నడుస్తోంది. మంత్రి పదవి కాకున్నా.. నామినేటెడ్ పదవి అయినా ఇవ్వాల్సిన అవసరం ఉందనేది నియోజకవర్గం నేతల టాక్ కూడా! కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో జగన్‌పై అనేక రకాల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మేకా ప్రతాప్ అప్పారావుకు పదవి అంటే.. కష్టమే.. అనేవారూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.