మేకపాటి వల్ల అవుతుందా? డౌటే మరి?
నెల్లూరు జిల్లాలో పార్టీలో నెలకొన్న వివాదాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు. జిల్లాల్లో అనేక చోట్ల వివాదాలను పరిష్కరించేందుకు నలుగురిని నియమించినా [more]
నెల్లూరు జిల్లాలో పార్టీలో నెలకొన్న వివాదాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు. జిల్లాల్లో అనేక చోట్ల వివాదాలను పరిష్కరించేందుకు నలుగురిని నియమించినా [more]
నెల్లూరు జిల్లాలో పార్టీలో నెలకొన్న వివాదాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు. జిల్లాల్లో అనేక చోట్ల వివాదాలను పరిష్కరించేందుకు నలుగురిని నియమించినా జగన్ మాత్రం నెల్లూరు జిల్లా వివాదాలను పరిష్కరంచే బాధ్యతను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలను ప్రారంభించారని సమాచారం.
వివాదాలకు దూరంగా…..
మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకు వెళతారు. మంత్రిని కదా అని మరొకరి నియోజకవర్గంలో వేలుపెట్టరు. ఏ ఎమ్మెల్యే మనస్సును నొప్పించని మనస్తత్వం మేకపాటి గౌతమ్ రెడ్డిది. అలాంటి మేకపాటి గౌతమ్ రెడ్డికి జగన్ పెద్ద టాస్కే అప్పగించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని జగన్ మేకపాటిని ఆదేశించారు.
కొద్దిరోజులుగా సమావేశాలు…..
దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి గత కొద్దిరోజులుగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశం అవుతున్నారు. తాను వస్తానని ఎమ్మెల్యేలకు మంత్రి మేకపాటి నుంచి ఫోన్ వస్తుండటంతో కొందరు తామే వస్తామని మేకపాటి కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సూళ్పూరు పేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లతో సమావేశమై నియోజకవర్గాల్లో సమస్యలతో పాటు పార్టీ పరంగా ఉన్న విభేదాలను కూడా చర్చించారని చెబుతున్నారు.
దాదాపు అన్ని నియోజకవర్గాల్లో…..
సీనియర్ నేతలు ఆనం రామనారాయణరెడ్డి లాంటి నేతలకు మేకపాటి గౌతమ్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. అయితే నెల్లూరు జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరంగా గ్రూపులున్నాయి. ఇక మంత్రికి, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడికి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదు. జిల్లా పార్టీ కార్యాలయానికి రాని ఎమ్మెల్యేలు ఐదుగురికి పైగానే ఉన్నారట. మరి ఈ వివాదాలను మేకపాటి గౌతమ్ రెడ్డి పరిష్కరించగలుగుతారా? డౌటే మరి.