ఆ క్వాలిటీస్ లేకుంటే ఎలా….?
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారతాయో.. వాటిని అలానే అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం నాయకులకు ఎంతో ఉంటుంది. ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పై [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారతాయో.. వాటిని అలానే అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం నాయకులకు ఎంతో ఉంటుంది. ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పై [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారతాయో.. వాటిని అలానే అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం నాయకులకు ఎంతో ఉంటుంది. ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. నాయకులు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పాతతరం నాయకులు సక్సెస్ అయ్యారు. అయితే, వారికి వారసులుగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఇలాంటి వ్యూహాలను అందిపుచ్చుకోవడంలోను, ప్రత్యర్థులను నిలువరించడంలోనూ ఏ మేరకు సక్సెస్ అయ్యారనేది కీలక చర్చగా మారుతోంది.
మేకాపాటి హవాతో….
నెల్లూరు రాజకీయాలను తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ తరఫున కీలకంగా చక్రం తిప్పిన నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి. సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడుగా ఆయన కాంగ్రెస్ మంచి గుర్తింపు సాదించారు. ముఖ్యంగా వైఎస్ అనుంగు మిత్రుడిగా కూడా మేకపాటి పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు ఎంపీగాఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున ఆచితూచి వ్యవహరించడంలోనూ ఆయన ముందున్నారు. 2009 లోకాంగ్రెస్ తరఫున విజయం సాధించిన మేకపాటి.. తర్వాత కాలంలో వైఎస్ ఫ్యామిలీకి అండగా నిలిచారు.
వారసుడిగా బరిలోకి దిగి….
కాంగ్రెస్ పార్టీలో మేకపాటి ఫ్యామిలీది సుధీర్ఘ ప్రస్థానం. ఆయన గతంలో ఒంగోలు, నరసారావుపేట ఎంపీగా కూడా గెలిచారు. ఎప్పటికప్పుడు పార్టీ తరఫున వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఎక్కడికక్కడ పార్టీని ముందుండి నడిపించారు. ఎక్కడా వివాదాలకు పోకుండా రాజకీయాలు అంటే.. కేవలం ఎన్నికల సమయంలోనే అనే నినాదానికి కట్టుబట్టారు. ఇక, ఆతర్వాత ఆయన వైఎస్ జగన్‌కు అండగా నిలిచారు. ఆ కుటుంబానికి నైతిక మద్దతు ఇచ్చారు. అనంతర కాలంలో వైసీపీ టికెట్‌పై ఆయన ఎంపీగా కూడా గెలిచారు. వైసీపీ టిక్కెట్‌పై 2012 ఉప ఎన్నికలతో పాటు 2014 ఎన్నికల్లోనూ ఆయన వరుస విజయాలు సాధించారు. ఇక, ఆయన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి, కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి కూడా రాజకీయాల్లోకి రావడం వైసీపీ తరపున విజయం సాధించడం తెలిసిందే.
తండ్రి బాటలో నడుస్తారనుకుంటే?
చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగాను, ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే గాను గెలిచారు. ఇక మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు విషయానికి వస్తే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మేకపాటి గౌతంరెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. అంతేకాదు, జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా, మిత్రుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వర్గంలో చోటు సంపాయించారు. అయితే, రాజకీయంగా చూస్తే.. ఆయనకు తన తండ్రిలో ఉన్న క్వాలీటీస్ పెద్దగా లేవని అంటున్నారు పరిశీలకులు.
కార్పొరేట్ పాలిటిక్స్ తో…..
రాజకీయంగా ప్రజలకు చేరువ కావడం ప్రజల్లో తన తండ్రి సంపాయించుకున్న విధంగా తాను కూడా ప్రత్యేకంగా పేరు సంపాయించుకోవడం వంటివి ఈయనకు కడు దూరంలో ఉన్నాయని, ఏదో తన తండ్రి హవాను అడ్డు పెట్టుకుని రెండు సార్లు గెలిచారే తప్ప సొంతగా గెలిచే సత్తా మేకపాటి గౌతం రెడ్డికి లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఆయన ఆత్మకూరులో 31 వేల మెజార్టీతో గెలిచినా అక్కడ టీడీపీ అభ్యర్థి ఎంపికలో వేసిన రాంగ్ స్ట్రాటజీతోనే గెలిచారు. గత ఎన్నికల్లో మళ్లీ అదృష్టం తలుపు తట్టి మళ్లీ విజయం సాధించారు. జిల్లాలో మేకపాటి గౌతంరెడ్డి కంటే యాక్టివ్‌గా ఉండే వాళ్లలో శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి లాంటి వాళ్లు ఉన్నా కూడా జగన్ మేకపాటి గౌతంరెడ్డికే కీలకమైన ఐటీ మంత్రి ఇచ్చారు. అయితే ఆయన కార్పొరేట్ పాలిటిక్స్‌తో అటు నియోజకవర్గంలోనూ, ఇటు జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర మాత్రం వేయలేకపోతున్నారు. ఆయన తీరు మార్చుకోకపోతే మున్ముందు కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు.