ఆ మంత్రిని జగన్ తప్పించరు… కానీ ఈ ట్విస్ట్ ఇస్తారట
త్వరలోనే జగన్ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఆయన చెప్పినట్టుగా.. రెండున్నరేళ్ల తర్వాత.. 90 శాతం మందిని మారుస్తానని [more]
త్వరలోనే జగన్ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఆయన చెప్పినట్టుగా.. రెండున్నరేళ్ల తర్వాత.. 90 శాతం మందిని మారుస్తానని [more]
త్వరలోనే జగన్ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఆయన చెప్పినట్టుగా.. రెండున్నరేళ్ల తర్వాత.. 90 శాతం మందిని మారుస్తానని జగన్ ముందే చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే మార్పుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలియడంతో యువ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎందరిని మారుస్తారు? అనేది కీలక ప్రశ్నగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. అందరూ సీఎం జగన్‌ను ఆరాధిస్తున్నవారే. వీరంతా తనకు విధేయులు అనే జగన్ వారిని మంత్రి పదవుల్లోకి తీసుకున్నారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ.. గుంటూరు జిల్లా కు చెందిన హోం మంత్రి మేకతోటి సుచరిత విషయంలో మార్పు ఉండదని అంటున్నారు.
నమ్మకమైన నేతగా…?
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న మేకతోటి సుచరిత ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్నారు. సీఎం జగన్‌కు ఆమె అత్యంత విశ్వాసపాత్రురాలు. జగన్ కోసం ఆమె కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బంపర్ ఆఫర్లు వదులుకుని మరీ ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచారు. టీడీపీ అడ్డాలో ఆమె చేసిన రిస్క్‌ను నాడు జగన్ ఎంతో అభినందించారు. 2014లో ఆమె ఓడినా గత ఎన్నికల్లో గెలిచాన ఏకంగా హోం మంత్రి పదవి ఇచ్చారు. ఈ పోస్టు.. సీఎం తర్వాత .. సీఎం వంటిది. రాష్ట్ర పోలీసులు, శాంతి భద్రతలు.. మొత్తంగా ఈ శాఖ పరిధిలోనే ఉంటాయి. దీంతో ఆమెకు ఎనలేని ప్రాధాన్యం ఉంది.
విపక్షానికి టార్గెట్ గా….
అయితే.. నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడుతున్నారనే వాదన కూడా అదే రేంజ్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హోం మంత్రి మేకతోటి సుచరిత సెంట్రిక్‌గా ఇటీవల కాలంలో ప్రధాన ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. పైగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, వేధింపులకు అడ్డుకట్ట పడడం లేదనే వాదన మేధావుల నుంచి కూడా వినిపిస్తోంది. దిశ యాప్ ఉన్నా అది దశ లేకుండా పోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో గుంటూరులో మేకతోటి సుచరిత విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను మంత్రివర్గం నుంచి పక్కన పెడతారని పార్టీలోనే ఓ వర్గం ప్రచారం ప్రారంభించింది.
శాఖ మారుస్తారని….
ఇదే విషయం వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించబోరని.. శాఖను మార్చే అవకాశం ఉందని ప్రధాన సలహాదారు చెప్పినట్టు జిల్లాలో ప్రచారం నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. సీఎం జగన్‌తోనూ, జగన్ సతీమణి భారతితో మేకతోటి సుచరితకు ఉన్న అనుబంధం.. స్నేహం నేపథ్యంలో ఆమె విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తారని.. కొందరు చెబుతున్నారు. అయితే.. హోం శాఖను మాత్రం తప్పించే అవకాశం ఉందని మాత్రం ఒప్పుకొంటున్నారు. మరి మేకతోటి సుచరిత విషయంలో జగన్ ఏం చేస్తారో చూడాలి.