సుచరితను తప్పిస్తే.. ఆయనకే మంత్రి పీఠం.. జోరందుకున్న ప్రచారం
ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్టుగా ఉంది.. వైసీపీ మంత్రి వర్గ కూర్పుపై నాయకుల ఆరాటం. మంత్రి వర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్ వ్యవస్థీకరిస్తానని జగన్.. కేబినెట్ [more]
ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్టుగా ఉంది.. వైసీపీ మంత్రి వర్గ కూర్పుపై నాయకుల ఆరాటం. మంత్రి వర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్ వ్యవస్థీకరిస్తానని జగన్.. కేబినెట్ [more]
ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్టుగా ఉంది.. వైసీపీ మంత్రి వర్గ కూర్పుపై నాయకుల ఆరాటం. మంత్రి వర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్ వ్యవస్థీకరిస్తానని జగన్.. కేబినెట్ ఏర్పాటు చేసిన సమయంలో చెప్పారు. దీంతో రెండున్నరేళ్లు ఎప్పుడు పూర్త వుతాయా ? అంటూ వైసీపీలో చాలా మంది నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. తమకు ఎప్పుడు మంత్రి పదవులు దక్కు తాయా ? అని జోస్యాలు చెప్పించుకుంటున్నారు. మరికొందరు.. తమకు తప్పకుండా మంత్రి పీఠం దక్కుతుందని భావిస్తున్నా రు. ఇలాంటి వారిలో గడిచిన నెల రోజులో మరొక నేత కూడా చేరిపోయారు.
కొన్నాళ్ల క్రితమే చేరి….
గుంటూరుకు చెందిన ఈయన.. కొన్నాళ్ల కిందట టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిచేశారు. గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ఈయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత .. చంద్రబాబు ఆయనకు మంచి పదవికే నామినేట్ చేశారు. దీంతో ఆయన సంతృప్తి చెందక.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇక్కడ కూడా జగన్ టీడీపీలో ఆయనకు ఏ పదవి ఉందో అదే పదవి కట్టబెట్టారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన తన అనుచరులతో కొత్త ప్రచారం ప్రారంభించారు. త్వరలోనే జగన్ మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేస్తారని.. అప్పుడు.. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కడం ఖాయమని చెబుతున్నారట. ఇటీవల అంతర్గతంగా ఓ సమావేశం నిర్వహించి మరీ.. తను వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసేదీ వివరించాట.
అందుకే పార్టీ మారానంటూ…
అయితే.. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు కదా! అని అనుచరులు ప్రశ్నించడంతో.. ఇది మామూలే. అక్కడ ఖాళీ చేయడం ఖాయం.. అందుకే నేను పార్టీ మారాను. అదేవిధంగా మంత్రి పీఠం కూడా మనకే. అని అనడంతో అనుచరులు దీనికి కొంత మసాలా జోడించి.. జిల్లా మంత్రి మేకతోటి సుచరిత మంత్రిగా సక్సెస్ కాలేక పోతున్నారని.. ప్రచారం ప్రారంభించారు. ఆమె ఉదాశీన వైఖరితోనే ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. అదే సమయంలో ఆమెను తప్పిస్తారని.. త్వరలోనే తమ నాయకుడికి పట్టం కడతారని కూడా అంటున్నారు.
ఉద్దేశ్యపూర్వకంగానే….?
అయితే.. ఈ అనుచరుల దూకుడుతో సదరు నాయకుడికి చిర్రెత్తుకొచ్చి.. వెంటనే ఇదేం లేదు.. అంతా తూచ్.. ! అంటూ మీడియా మిత్రులకు సమాచారం చేరవేశారు. మొత్తానికి నిప్పులేందే పొగరాదుగా.. అన్నట్టు.. మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న సదరు నాయకుడు ఉద్దేశ పూర్వకంగానే ఈ ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు వైసీపీలోకి కొందరు నాయకులు. ట్విస్ట్ ఏంటంటే సదరు నేత అటు సుచరితతో పాటు తాను కన్నేసిన నియోజకవర్గంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేసేలా తెరవెనక చక్రం తిప్పుతున్నారన్న టాక్ కూడా ఐదారు నెలలుగా జిల్లా రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది.