ఒవైసీతో వారికే లాస్…. ఆయనకు మాత్రం?
ఎంఐఎం నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ. క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు ఎంఐఎం విస్తరిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత [more]
ఎంఐఎం నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ. క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు ఎంఐఎం విస్తరిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత [more]
ఎంఐఎం నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ. క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు ఎంఐఎం విస్తరిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం ఓటు బ్యాంకు లక్ష్యంగా ఎంఐఎం అనేక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ మహారాష్ట్రకే పరిమితమయ్యారనుకుంటే నేడు బీహార్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించనుంది.
హైదరాబాద్ కే….
ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్ కే పరిమితం. హైదరాబాద్ లో కూడా ఓల్డ్ సిటీ లోనే దాని ప్రభావం ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓల్డ్ సిటీలో ఎంఐఎంను ఓడించే పార్టీ లేకపోవడం విశేషం. అందుకే గతంలో టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇప్పుడు టీఆర్ఎస్ అయినా అధికారంలో ఉన్నప్పడు ఎంఐఎంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ ను దాటి ఇప్పుడిప్పడే అసదుద్దీన్ పార్టీని విస్తరించే కార్యక్రమంపై దృష్టిపెట్టారు.
ఐదు స్థానాల్లో…..
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. మహారాష్ట్రలో మాత్రం ఎంఐఎం విజయాలు నమోదు చేసుకుంది. ఇప్పుడు తాజాగా బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటింది. ముస్లిం సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించింది. మొత్తం ఐదు స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించి బీహార్ రాజకీయాల్లో ఎంఐఎం కీలక పాత్ర పోషించడానికి సిద్దమయింది.
బీహార్ లో కీలకంగా….
బీహార్ లోని అమోర్, కొచధామమ్, జోకిహాట్, బైసీ, బహదూర్ గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థులు దాదాపు పది నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగారు. ప్రధానంగా విపక్ష ఆర్జేడీకి నష్టం చేశారనే చెప్పాలి. ఒవైసీ వల్ల బీజేపీ యేతర పార్టీలకు నష్టం చేకూరుతుంది. అందుకే ఒవైసీ పార్టీని బీజేపీకి బీ టీంగా అభివర్ణిస్తారు. హంగ్ ఏర్పడి ఉంటే ఎంఐఎం కీలకంగా మారి ఉండేది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఏది ఏమైనా హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎంను ఒవైసీ ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.