కొడాలి, దేవినేని ల రేటింగ్స్ అదుర్స్ ట … !!
తెలుగు రాష్ట్రాల్లో బుల్లి తెరపై బాగా ఆదరణ పొందినవి జబర్దస్త్ కామెడీ షో అయితే అంతే పాపులారిటీ బిగ్ బాస్ షో కి ఉంది. ఇవి స్టార్ట్ [more]
తెలుగు రాష్ట్రాల్లో బుల్లి తెరపై బాగా ఆదరణ పొందినవి జబర్దస్త్ కామెడీ షో అయితే అంతే పాపులారిటీ బిగ్ బాస్ షో కి ఉంది. ఇవి స్టార్ట్ [more]
తెలుగు రాష్ట్రాల్లో బుల్లి తెరపై బాగా ఆదరణ పొందినవి జబర్దస్త్ కామెడీ షో అయితే అంతే పాపులారిటీ బిగ్ బాస్ షో కి ఉంది. ఇవి స్టార్ట్ అవుతున్నాయంటే చాలు ప్రేక్షకులు చూసేందుకు ఎంతో ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండు షో లను మించిన రేటింగ్స్ ఇద్దరు పొలిటికల్ స్టార్స్ కి ఏర్పడింది. వారిద్దరే ఎపి మంత్రి కొడాలి నాని, టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ కావడం విశేషం. చిత్ర విచిత్ర బూతు బాషా పదకోశాలు ఔపాసన పట్టిన వీరిద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి హద్దులు దాటి చెలరేగిపోతూ ఉంటారు.
ఒరేయ్ అంటూ మొదలు పెట్టి …
వీరిద్దరి ప్రెస్ మీట్లు ఒరేయ్ అంటూ మొదలు అవుతాయి. ఎవరైనా టివి చూడకుండా వార్తలు వింటున్నా ఫలానా నేత పురాణం మొదలు పెట్టారని ఎంతో ఆసక్తిగా వచ్చి కొత్త తిట్లు ఏమున్నాయని వచ్చి మరీ చూస్తారు. అంతలా ఇద్దరు చెలరేగిపోతారు. మంత్రి స్థాయిలో ఉండి కొడాలి నాని ఏమిటి ఈ బూతులు అన్నా కూడా ఆయన టిడిపి వారికి ఇలా చెబితేనే అర్ధం అవుతుందని పసుపు పార్టీ నుంచి వచ్చిన వాడిగా తనకు తెలుసనడం పలుసార్లు చెప్పడం గమనార్హం. ఇక దేవినేని ఉమ సైతం ఎక్కడా తగ్గడం లేదు. ఆయన కూడా తన కొడాలి నాని లాగే కిందకి దిగి మాటల యుద్ధం చేస్తున్నారు.
ఎ సర్టిఫికెట్ ఇవ్వలిసిందే …
వీరి విమర్శలు ఆరోపణల సంగతి ఎలా ఉన్నా బుల్లి తెరకు ఏ సర్టిఫికెట్ ఇస్తే వీరి ప్రెస్ మీట్లకు ఇవ్వలిసిందే అంటున్నారు కొందరు కామెడీగా. పిల్లలు వీరి ప్రెస్ మీట్లు దయచేసి చూడకండి అంటూ సోషల్ మీడియా లో సైతం పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా వీరిద్దరూ పోటీలు పడే బూతు యుద్ధం లో ఉత్సహంగా ఉల్లాసంగా పాల్గొనడం విచారకరం. గతంలో ఎవరైనా బూతులు పొరపాటున మాట్లాడితే కుయి మని బీప్ సౌండ్ ఇచ్చే టివి న్యూస్ ఛానెల్స్ రేటింగ్స్ కోసం ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ ఇచ్చి ఎంటర్ టైన్ మెంట్ ను ఆస్వాదించండి అన్న తరహాలో ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో కొడాలి నాని, దేవినేని ఉమల బూతు పురాణం అందించడం నేటి ట్రెండ్ గా మారిపోయింది.