కమల్ ఉత్సాహంగా.. రజనీ మాత్రం ఆలోచనలో?
తమిళనాడు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ నెల 31వ తేదీన రజనీకాంత్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. అయితే రజనీ కొత్త [more]
తమిళనాడు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ నెల 31వ తేదీన రజనీకాంత్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. అయితే రజనీ కొత్త [more]
తమిళనాడు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ నెల 31వ తేదీన రజనీకాంత్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. అయితే రజనీ కొత్త పార్టీ బీజేపీ ప్రోద్బలంతోనే వస్తుందన్న ప్రచారం ఇప్పటికే తమిళనాట అంతటా జరుగుతుంది. ప్రధానంగా డీఎంకే ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా చేస్తుంది. తమను దెబ్బతీయడానికి డీఎంకే ఆడుతున్న ఆటలో భాగమే రజనీకాంత్ కొత్త పార్టీ అని వారు ఆరోపిస్తున్నారు. కానీ రజనీకాంత్ తన పార్టీ ఆలోచనను విరమించుకున్నారు.
రజనీతో పొత్తుకు..
కమల్ హాసన్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే రజనీకాంత్ పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కమల్ హాసన్ చెప్పారు. రజనీకాంత్ పార్టీని ప్రకటించిన తర్వాత చర్చలు జరపాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. రజనీకాంత్ ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకోనని చెప్పడంతో తాను సిద్ధమేనని కమల్ హాసన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ పార్టీ రాకపోతుండటంతో కమల్ హాసన్ తృతీయ కూటమి ఏర్పాటుకు కొంత గండిపడినట్లే అవుతుంది.
రజనీ ఆలోచనలు వేరుగా….
అయితే రజనీకాంత్ మాత్రం కమల్ హాసన్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వెనకాడుతున్నట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రజనీకాంత్ కొంత బీజేపీ అనుకూలంగా ఉండటమే కారణం. కమల్ హాసన్ మాత్రం బీజేపీ మీద ఒంటికాలితో లేస్తున్నారు. దీంతో కమల్ హాసన్ తో పొత్తునకు రజనీకాంత్ అంగీకరించే అవకాశాలు కన్పించడం లేదు. డీఎండీకే, పీఎంకేలతో కలసి రజనీకాంత్ ఎన్నికలకు వెళతారన్న చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి రజనీకాంత్ తెరదించేశారు.
సీట్ల సర్దుబాటు కూడా…..
ఇప్పటికే తమిళనాడులో రెండు కూటములు బలంగా ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే కూటములు సీట్ల సర్దుబాటుకు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే రజనీకాంత్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కూటముల్లోని కొన్ని పార్టీలు రజనీకాంత్ చెంతకు చేరేందుకు రెడీ అయిపోయాయి. అందుకే కొన్ని పార్టీలు ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదు. ఇప్పుడు రజనీకాంత్ పార్టీ రాకపోతుండటంతో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి వెనకడగు వేయగా, కమల్ హాసన్ మాత్రం వేగంగా దూసుకుపోతున్నారు.