చివరకు మోదీయే మైనస్ అవుతారా? ఏంది?
బీహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీహార్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పిస్తున్నారు. నితీష్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నితీష్ [more]
బీహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీహార్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పిస్తున్నారు. నితీష్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నితీష్ [more]
బీహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీహార్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పిస్తున్నారు. నితీష్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నితీష్ ను మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని మోదీ పదే పదే కోరుతున్నారు. తాను బీహార్ ప్రజలకు అండగా ఉంటానని మోదీ హామీ ఇస్తున్నారు. సరిహద్దుల్లో బీహార్ సైనికులు చేస్తున్న కృషిని కూడా ప్రశంసిస్తూ లోకల్ సెంటిమెంట్ ను రగిలిస్తున్నారు.
విశ్వసనీయత ఉందా?
అంతా బాగానే ఉంది. మరి మోదీ మాటలను బీహారీలు విశ్వసిస్తారా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. 2015 ఎన్నికల్లోనూ బీహార్ లో ప్రధానిగా మోదీ ప్రచారం చేశారు. బీజేపీని గెలిపిస్తే లక్షల కోట్ల నిధులను మంజూరు చేస్తానని చెప్పారు. అయితే అప్పట్లో మోదీ మాటలను విశ్వసించని బీహార్ ప్రజలు మహాగడ్బంధన్ కే పట్టం కట్టారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.
సర్వేలు కూడా అంతేగా?
గత ఎన్నికల్లోనూ సర్వేలన్నీ బీజేపీ వైపు మొగ్గు చూపాయి. బీహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అప్పుడు కూడా ముందస్తు సర్వేలు తెలిపాయి. కానీ తీరా ఎన్నికల ఫలితాలు మాత్రం మహాగడ్బంధన్ కే అనుకూలంగా వచ్చాయి. ఈసారి కూడా ముందస్తు సర్వేలు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ సమయంలో ఉపాధి లేక సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మోదీ పై వ్యతిరేకత బీహార్ లో పెరగడానికి కూడా ఇది ఒక కారణంగా చెబుతున్నారు.
వరాలు కురిపిస్తున్నా…..
ఇక గత ఎన్నికల్లో తాము నితీష్ కుమార్ కు మద్దతిస్తే ఆయన మోదీ చంకలో చేరిపోయారని బీహారీలు గుర్రుగా ఉన్నారంటున్నారు. నితీష్ కుమార్ నిజాయితీ పరుడైన నేత అయినప్పటికీ ఆయన తాము ఇచ్చిన తీర్పును కాదని బీజేపీతో కలసి నడవటాన్ని ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. మోదీ మాత్రం తన ప్రచారంలో బీహార్ పై వరాల జల్లు కురిపిస్తున్నా ప్రజలు మాత్రం లైట్ తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి. నితీష్ కుమార్ కూడా మోదీ ప్రచారం పైనే ఆధారపడుతుండటం ఆయనకు మైనస్ గా మారుతుందంటున్నారు.
- Tags
- modi
- à°®à±à°¦à±