మోదుగులను మోయలేరా?
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. గుంటూరు వెస్ట్‌కు [more]
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. గుంటూరు వెస్ట్‌కు [more]
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. గుంటూరు వెస్ట్‌కు ప్రాతినిథ్యం కూడా వహించారు. అయితే, ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆయన మాట వినిపించడమూ లేదు. దీంతో ఇక, ఆయన ప్రస్థానం ముగిసినట్టేనా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభమైన మోదుగుల రాజకీయ ప్రస్థానం.. అక్కడ టికెట్ దక్కక పోవడంతో 2009లో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే ఆయన నరసారావుపేట ఎంపీ టికెట్‌ను సంపాయించి అక్కడ నుంచి పోటీకి దిగి విజయం సాధించారు.
బాబుతో విభేదించి….
ఇక, 2014లో జరిగిన ఎన్నికల నాటికి.. తనకు ఎంపీ టికెట్ కాదని, పట్టుబట్టి మరీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే సీటును దక్కించుకుని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించారు. గెలుపు గుర్రం ఎక్కినా.. తనకు బాబు కేబినెట్లో ఎక్కడా ప్రాధాన్యం దక్కలేదనే ఆందోళన మాత్రం ఆయనను వెంటాడింది. ఈ క్రమంలోనే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బాబు ప్రభుత్వంపై బహిరంగ వేదికలపైనే విమర్శలు గుప్పించారు. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక, గత ఏడాది ఎన్నికలకు ముందు జరిగిన వనభోజనాల సమయంలో “రెడ్డి వర్గం అంతా ఒక తాటిపైకి రావాలి. అధికారం రాకపోతే.. ఇబ్బందులే అంటూ..“ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపింది.
వైసీపీ నుంచి పోటీ చేసి….
ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు అందరూ ఊహించినట్టుగానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ ఎంగా ఉన్న జయదేవ్ తనకు సహకరించలేదనే అక్కసుతో.. ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలని నిర్ణయించుకుని, వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ టికెట్ పట్టుబట్టి సాధించి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ ఉన్నా.. ఇక్కడ మాత్రం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. చిత్రంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా ఎక్కడా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అడ్రస్ ఎక్కడా లేదు.
ఎందరో వెయిటింగ్ లో…..
అయితే, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సమీప బంధువు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏదో ఒక కీలక పదవి వచ్చే అవకాశం ఉంది. ఆయనకు జగన్ లోకేష్‌ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానిన బహిరంగంగా హామీ ఇచ్చారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదు. వైసీపీలో ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్ హామీలతో పదవుల కోసం వెయిట్ చేస్తోన్న వాళ్లు ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు. ఇక, ఇప్పుడు ఆయన గల్లా జయదేవ్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా లెక్కించకపోవడం వల్లే తాను ఓడిపోయానని ఆరోపించారు. ఇది తప్ప మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసింది ఏమీ కనిపించడం లేదు.
జగన్ పర్యటనలో కూడా….
ఇక ఇటీవల జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కాని అప్పిరెడ్డి లాంటి వాళ్లు హడావిడి చేసినా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కడా కనపడని పరిస్థితి. మొత్తంగా వైసీపీ అధికారంలో ఉండడంతో చిన్నా చితకా నాయకుల దూకుడే మామూలుగా లేదు.. వాళ్లే నానా హడావిడి చేస్తున్నారు. కానీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం సైలెంట్ అయ్యారు. మరి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మళ్లీ రాజకీయంగా పుంజుకుంటాడా ? లేదా ? అన్నది కాలమే ఆన్సర్ చేయాలి.