మోదుగుల దూరం అయ్యారా? పక్కన పెట్టారా?
కల చెదిరింది.. కథమారింది.. అనే పాట ఇప్పుడు రాజకీయాల్లో గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఖచ్చితంగా సరిపోతుందని అంటున్నారు పరిశీలకులు. అదేంటి అంటే.. ఆయన [more]
కల చెదిరింది.. కథమారింది.. అనే పాట ఇప్పుడు రాజకీయాల్లో గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఖచ్చితంగా సరిపోతుందని అంటున్నారు పరిశీలకులు. అదేంటి అంటే.. ఆయన [more]
కల చెదిరింది.. కథమారింది.. అనే పాట ఇప్పుడు రాజకీయాల్లో గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఖచ్చితంగా సరిపోతుందని అంటున్నారు పరిశీలకులు. అదేంటి అంటే.. ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు ఆయన కలను చెదరగొట్టి.. ఏకంగా కథనే మార్చే శాయని చెబుతున్నారు. మరి ఆ విషయం ఏంటో చూద్దామా? 2014లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల వేణుగోపాలరెడ్డికి అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని లేదు. నరసరావుపేట నుంచి లేదా గుంటూరు నుంచి ఎంపీ అయి.. పార్లమెంటుకు వెళ్లి.. తన వ్యాపారాలను చక్కబెట్టుకోవాలని కోరిక.
సొంత పార్టీపైనే…..
కానీ, నాడు చంద్రబాబు పట్టుబట్టి ఆయనను వెస్ట్ నుంచి నిలబెట్టారు. ఆయన గెలిచారు కూడా. ఈ క్రమంలోనే రెడ్డి కోటాలో తనకు మంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. కానీ, బాబు ఇవ్వలేదు. దీంతో మోదుగుల వేణుగోపాలరెడ్డి బాబుపై కోపం పెంచుకున్నారు. వాస్తవానికి ఇది బాబుపై అనేకన్నా.. కూడా కమ్మ సామాజిక వర్గమే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుతగులుతోందని మోదుగుల వేణుగోపాలరెడ్డి బావించి ఏకంగా ఆ వర్గంపైనే ఆయన కోపం పెంచుకున్నారు. ఇదే సమయంలో అప్పట్లో తనకు ఎంపీ గల్లా జయదేవ్ (ఇప్పుడు కూడా ఈయనే ఎంపీ) సహకరించడం లేదని పలుమార్లు ఆరోపించారు. ఇలా సొంత పార్టీలోనే తిరుగుబావుటా ఎగరేశారు.
రాజ్యసభ సీటును ఆశించినా….
ఇక, 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మనం (రెడ్డి వర్గం) అధికారంలోకి రాకపోతే.. కష్టమే అని చేసిన వ్యాఖ్యలతో ఇక, ఆయన టీడీపీకి దూరమవడం ఖాయమని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీలోకి చేరిపోవడం, పట్టుబట్టి గుంటూరు ఎంపీ టికెట్ సంపాయించడం తెలిసిందే. అయితే, రాష్ట్రం మొత్తంగా జగన్ సునామీ ఉన్నప్పటికీ.. మోదుగుల మాత్రం చతికిలపడ్డారు. దీంతో ఆయన కల చెదిరిపోయింది. ఇక, ఎలాగూ… తాను ఓడిపోయాను కాబట్టి.. జగన్ తనకు కీలకమైన పదవి ఏదైనా అప్ప గిస్తారని భావించారు. ముఖ్యంగా రాజ్యసభ పై కన్నేశారని ఆయన అనుచరులు చెబుతారు.
జగన్ పట్టించుకోక పోవడంతో…
కానీ, జగన్ మోదుగుల పేరును కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. ఫలితంగా ఆయన కథ మారిపోయింది. ఎవరిపైనైతే.. పంతం పట్టి గెలుపు గుర్రం ఎక్కాలని భావించారో..ఎవరినైతే ఓడించాలని భావించారో.. ఆయన గెలవడమే కాకుండా నిత్యం వార్తల్లో ఉండడాన్ని మోదుగుల వేణుగోపాలరెడ్డి అస్సలు సహించలేక పోతున్నా రు. ఇటు పార్టీలోనూ ఆయన వ్యవహార శైలితో పడలేక చాలా మంది నాయకులు దూరమయ్యారు. దీంతో ఇప్పుడు జగన్కు తనకు మధ్య ఉన్న బంధం కూడా చాలా వరకు చిక్కిపోయిందని అంటున్నారు.
ఏ పదవి దక్కే అవకాశం లేక….
ఎమ్మెల్సీ ఎలాగూ రాదు.. మండలి రద్దు అయిపోయింది. ఇక తన బంధువు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇక మోదుగులకు ఎప్పటకీ రాజ్యసభ రాదు. ఇక నామినేటెడ్ పదవి అయినా వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పటికే గుంటూరు నగరంలో టిక్కెట్లు త్యాగం చేసిన కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి పదవుల కోసం కాచుకుని ఉన్నారు. ఇక ఇప్పుడు పట్టుమని పది మందిని కూడా ఆయన నిలబెట్టుకోలేక పోవడం, తనకంటూ.. ఏమీ కేడర్ లేకపోవడం వంటివి మోదుగుల వేణుగోపాలరెడ్డి భవితవ్యాన్ని శాసిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఆయన ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుందో చూడాలి.