Mothkupalli : మోత్కుపల్లికి చాలా కాలం తర్వాత?
సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నక్క తోకను తొక్కినట్లే కనపడుతుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారి వేసిన అడుగు [more]
సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నక్క తోకను తొక్కినట్లే కనపడుతుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారి వేసిన అడుగు [more]

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నక్క తోకను తొక్కినట్లే కనపడుతుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఇరవై ఏళ్ల తర్వాత తొలిసారి వేసిన అడుగు సత్ఫలితాలనిస్తుందనే చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ లుక్స్ లో పడి పదవికి కొద్ది దూరంలోనే మోత్కుపల్లి నరసింహులు ఉన్నారన్నది టాక్. కేసీఆర్ ఆయనకు సముచితమైన పదవి ఇచ్చి గౌరవిస్తారని తెలుస్తోంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం….
మోత్కుపల్లి నరిసింహులుది సుదీర్ఘ రాజకీయ అనుభవం. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మోత్కుపల్లి నరసింహులు బలమైన నేతగా ఉండేవారు. దళితనేతగా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లో అడుగుపెట్టిన మోత్కుపల్లి నరసింహులు అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఇరవై ఏళ్లుగా ఆయనకు రాజకీయంగా కలసి రావడం లేదు. గెలుపు పిలుపు విని రెండు దశాబ్దాలవుతుంది.
అన్ని పార్టీలు….
దీంతో దాదాపు మోత్కుపల్లి నరసింహులు అన్ని పార్టీలు మారారు. టీడీపీ, కాంగ్రెస్ ఇటీవల బీజేపీలో చేరడంతో మూడు ప్రధాన పార్టీల గడపలను ఆయన తాకి వచ్చినట్లయింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కొంత కేసీఆర్ కు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారు. దీంతో టీడీపీ కూడా అప్పట్లో సీరియస్ అయింది. కానీ టీడీపీలో ఉన్న మోత్కుపల్లి 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లోకి వెళదామనుకున్నా వీలుపడలేదు.
ఛైర్మన్ పదవిని….
దళితబంధు పథకం పెట్టిన తర్వాత కేసీఆర్ కు మోత్కుపల్లి నరసింహులు మరింత దగ్గరయ్యారు. ఒకరోజు దీక్ష చేసి కేసీఆర్ కు మరింత దగ్గరయ్యారు. దీంతో మోత్కుపల్లి నరసింహులుకు త్వరలో కేబినెట్ ర్యాంకు ఉన్న పదవి దక్కుతుందంటున్నారు. దళితు బంధు పథకం అమలు ఛైర్మన్ బాధ్యతలను కేసీఆర్ మోత్కుపల్లి నరసింహులుకు అప్పగించే అవకాశముంది. రెండేళ్ల పదవీకాలం ఉండే ఈ పోస్టు ఆయనకు రిజర్వ్ చేశారంటున్నారు.