Maa : అంతా ఈయనవల్లనే….కట్టడి చేయడానికేనా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చిత్ర పరిశ్రమను రెండుగా చీల్చాయి. ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. మెగా కాంపౌండ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. మొదట నాగబాబు [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చిత్ర పరిశ్రమను రెండుగా చీల్చాయి. ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. మెగా కాంపౌండ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. మొదట నాగబాబు [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చిత్ర పరిశ్రమను రెండుగా చీల్చాయి. ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. మెగా కాంపౌండ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. మొదట నాగబాబు రాజీనామా అస్త్రాన్ని వదిలారు. వెను వెంటనే ఒక్కరొక్కరుగా రాజీనామా బాట పట్టారు. దీనికి ప్రధాన కారణం మంచు ప్యామిలీ ఆధిపత్యానికి తెరదించేందుకేనన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో రాజకీయాలు కూడా చోటు చేసుకున్నాయనడం వాస్తవం. కేవలం ఒకే ఒక వ్యక్తి నరేష్ కారణంగానే ఇంత రాద్ధాంతం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన 11 మంది ఎంపికయిన సభ్యులు రాజీనామా చేశారు.
మెగా కాంపౌండ్….
మా అసోసియేషన్ ఎన్నికలు తొలి నుంచి టెన్షన్ ను పుట్టించాయి. ఒకరకంగా చెప్పాలటే రాజీకీయ, కుల విభేదాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించాయి. నేరుగా చెప్పాలంటే కమ్మ, కాపు కులాల ఆధిపత్యం కన్పించింది. మెగా ఫ్యామిలీ డామినేషన్ ను ఈ ఎన్నికలు దారుణంగా దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో మంచు కుటుంబం గెలవడానికి నరేష్ కీలక పాత్ర పోషించారు. మెగా కుటుంబం ఎటు చెబితే అటు ఓట్లు పడతాయని భావించారు. చిరంజీవి నేరుగా ప్రకాష్ రాజ్ కు మద్దతివ్వకపోయినా నాగబాబు చెబితే చిరు మద్దతు ఉన్నట్లేనన్నది సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిందే.
పాలిటిక్స్ కూడా….
ఇక రాజకీయం అంటారా…. ప్రకాష్ రాజ్ ఎంపికే పవర్ లో ఉన్న పార్టీ చేసిందంటారు. తెలంగాణలో అధికార పార్టీలో కీలక నేత ప్రకాష్ రాజ్ ను గెలిపించాలని చిరంజీవిపై వత్తిడి తెచ్చారన్న ప్రచారమూ ఉంది. దీంతోనే ఈ ఎన్నికలకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మంచు విష్ణు ప్యానెల్ వెనక పొరుగు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అన్ని రకాలుగా సహకరించిందన్న వాదనలు కూడా ఉన్నాయి.
కొత్త అసోసియేషన్ లేదు….
కాని ఒకటి మాత్రం నిజం. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఓటమిని ధైర్యంగా అంగీకరించగలగాలి. కానీ ఓటమిని ఓర్వలేక రాజీనామాలకు దిగడం ఓటర్లను కించపర్చినట్లే లెక్క. ఒకరకంగా ఒక సామాజికవర్గాన్ని చలన చిత్ర పరిశ్రమలో కంట్రోల్ చేయడానికే ఈ రాజీనామాల పర్వం అన్న చర్చ జరుగుతుంది. మా అసోసియేషన్ స్థానంలో కొత్త అసోసియేషన్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. కేవలం నరేష్ కారణంగానే ఇంత రాద్ధాంతం జరిగిందని, ఎన్నికల తర్వాత చిరంజీవి, రాంచరణ్ ల పై మంచు విష్ణు చేసిన కామెంట్లు కూడా వీరి రాజీనామాలకు ప్రధాన కారణం.