తేల్చుకుందామంటున్నారుగా
మున్సిపల్ ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి. అయితే కరీంనగర్ లో మాత్రం పార్టీల మధ్య కన్నా వ్యక్తుల మధ్య పోరు మొదలయిందనే చెప్పాలి. ఇద్దరు నేతల మధ్య పోరు [more]
మున్సిపల్ ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి. అయితే కరీంనగర్ లో మాత్రం పార్టీల మధ్య కన్నా వ్యక్తుల మధ్య పోరు మొదలయిందనే చెప్పాలి. ఇద్దరు నేతల మధ్య పోరు [more]
మున్సిపల్ ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి. అయితే కరీంనగర్ లో మాత్రం పార్టీల మధ్య కన్నా వ్యక్తుల మధ్య పోరు మొదలయిందనే చెప్పాలి. ఇద్దరు నేతల మధ్య పోరు కరీంనగర్ లో రసవత్తరంగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్ ను గెలిచి సత్తా నిరూపించు కోవాలనుకుంటున్నారు ఈ ఇద్దరు నేతలు. వారే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఇద్దరి చుట్టూనే రాజకీయం తిరుగుతోంది.
బండి సంజయ్ గెలుపుతో….
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఊహించని విజయం సాధించింది. గతంలో ఇక్కడ బీజేపీ గెలిచిన సందర్భాలు ఇక్కడ ఉన్నా కరీనంగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ గెలవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పై కన్నేసి ఉంచారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకునేలా ఆయన ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు….
మున్సిపల్ ఎన్నికలు వస్తాయని తెలిసి ఆయన ముందుగానే అభ్యర్థుల జాబితాను కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ గెలిచి మంత్రి గంగుల కమలాకర్ ను దెబ్బ కొట్టాలన్నది బండి సంజయ్ వ్యూహంగా ఉంది. ఇద్దరికీ మద్య మాటల యుద్ధం కూడా ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునేలా స్కెచ్ లు రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆడియో టేపుల వ్యవహారం కూడా ఇద్దరి మధ్య మరింత వైరాన్ని పెంచింది. దీంతో కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు ఎంపీ వర్సెస్ మంత్రిగా మారాయనడంలో ఆశ్చర్యం లేదు.
సర్వేల ద్వారానే అభ్యర్థుల ఎంపిక……
ఇక మంత్రి గంగుల కమలాకర్ మంత్రిగా ప్రమోషన్ పొంది మంచి ఊపు మీదున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పైన మరోసారి గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు. అందుకే మంత్రి వార్డుల వారీగా ఆశావహులపై సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేల్లో గెలుపు అవకాశాలున్న వారికే టిక్కెట్లు కేటాయించాలన్న ఉద్దేశ్యంతో గంగుల కమలాకర్ ఉన్నారు. ఇప్పటికే మంత్రిగా కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన గంగుల కమలాకర్ ఎలాగైనా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. మొత్తం మీద కరీంనగర్ లో పార్టీల మధ్య కాకుండా ఎంపీ వర్సెస్ ఎంపీల వార్ గా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.