ముద్రగడకు ముహూర్తం పెట్టేశారా?
ముద్రగడ పద్మనాభంకు జగన్ అవకాశమివ్వనున్నారా? ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను పవన్ కల్యాణ్ ను ధీటుగా ఎదుర్కొనాలంటే [more]
ముద్రగడ పద్మనాభంకు జగన్ అవకాశమివ్వనున్నారా? ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను పవన్ కల్యాణ్ ను ధీటుగా ఎదుర్కొనాలంటే [more]
ముద్రగడ పద్మనాభంకు జగన్ అవకాశమివ్వనున్నారా? ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను పవన్ కల్యాణ్ ను ధీటుగా ఎదుర్కొనాలంటే ముద్రగడ పద్మనాభంను దరి చేర్చుకోవడం మార్గమని జగన్ విశ్వసిస్తున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సుముఖంగా ఉన్నారని, త్వరలోనే ఆయనను వైసీపీ కాపు నేతలు కలుస్తారని ప్రచారం జరుగుతుంది.
ఆయనంటే గౌరవం.. ప్రేమ…..
ఎవరు అవునన్నా కాదన్నా ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలో బలమైన నేత. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ కంటే ముద్రగడ పద్మనాభంను కాపు సామాజికవర్గం ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తారు. కాపు సామాజికవర్గం కోసం ముద్రగడ పద్మనాభం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసిన తీరును వారు గుర్తుంచుకుంటారు. వంగవీటి రంగా తర్వాత కాపు సామాజికవర్గం ఎక్కువగా ప్రేమించేది, గౌరవించేది ముద్రగడ పద్మనాభంను మాత్రమే.
వైసీపీలో ఆ స్థాయి నేత…..
అయితే వైసీపీలో బలమైన కాపు నేతలు ఎవరూ లేరు. ఉన్నా వారి నియోజకవర్గాలకే ప్రభావం చేసే వారు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో బలమైన నేత లేరు. వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. పవన్ కల్యాణ్, సోము వీర్రాజులు వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓటర్లపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి తీసుకురావాలని ఆ జిల్లాకు చెందిన నేతలకు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ పదవి ఇచ్చి….
ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరితే ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని, అంతేకాకుండా రాజ్యసభ పదవి కూడా ఇస్తామని జగన్ చెప్పినట్లు తెలిసింది. ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలో చేరాల్సిందిగా ఇప్పటికే బీజేపీ ప్రయత్నించింది. సోము వీర్రాజు స్వయంగా వెళ్లి కలిసినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ముద్రగడ పద్మనాభంకు జగన్ అంటే కొంత సానుకూలత ఉందంటున్నారు. అందుకే జగన్ ప్రపోజల్ కు ఆయన అంగీకరించే అవకాశాలున్నాయి. జగన్ ఈ ఐడియా వర్క్ అవుట్ అయితే కాపు సామాజికవర్గంలో బీజేపీ, జనసేనకు కొంత గండిపడే అవకాశముంది.