దీనికి అంటుకుంటే ఇక అంతే సంగతులు?
ముంబయిలోని అతి పెద్ద మురికి వాడ ఇప్పుడు దేశాన్ని భయపెడుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా ధారవి ప్రాంత ఫేమస్. ఇక్కడ దాదాపు పదహారు లక్షల మంది [more]
ముంబయిలోని అతి పెద్ద మురికి వాడ ఇప్పుడు దేశాన్ని భయపెడుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా ధారవి ప్రాంత ఫేమస్. ఇక్కడ దాదాపు పదహారు లక్షల మంది [more]
ముంబయిలోని అతి పెద్ద మురికి వాడ ఇప్పుడు దేశాన్ని భయపెడుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా ధారవి ప్రాంత ఫేమస్. ఇక్కడ దాదాపు పదహారు లక్షల మంది నివాస ముంటు న్నారు. ఇరుకైన ఇళ్లు, రేకుల గదుల్లోనే వీరి నివాసం. భారత్ కరోనా విషయంలో భయపడుతుంది కూడా ఇటువంటి మురికివాడలను చూసే. మురికివాడల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే దానిని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశముంటుంది.
అన్ని రాష్ట్రాలకూ….
అందుకే ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం మురికివాడలపై ముందు నుంచి ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ శానిటైజ్ చేయించడంతో పాటు వారికి రక్షిత నీరు, ఆహారం అందించే కార్యక్రమాలను చేపట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. వీరంతా పనిమనుషులుగానూ, దినసరి కూలీలుగానూ ఉండటంతో వీరి ద్వారా లక్షల మందికి వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన మొదటి నుంచి ఉంది.
ధారవి మురికివాడలో….
అయితే మహరాష్ట్రలోని ముంబయి ధారావి మురికివాడకు వైరస్ ఇప్పటికి ఇద్దరికి సోకింది. ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణించారు. మరో వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ గా తేలిన వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడు. దీంతో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయింది. మురికివాడలో వైద్య పరీక్షలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా అనుమానితులను ఇప్పటికే అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం అప్రమత్తం….
మహారాష్ట్ర ఇప్పటికే పాజిటివ్ కేసుల్లోనూ, మరణాల సంఖ్యలోనూ అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజటివ్ కేసులు సంఖ్య 500 దాటింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన అధికమయింది. దీంతో ధారవి మురికివాడలో కరోనా వైరస్ మరింత ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఒక అధికారిని ఇందుకోసం నియమించారు. ఈ మురికివాడలో వైరస్ ప్రబలితే కేసులు వేల సంఖ్యలో పెరుగుతాయన్న ఆందోళన అందరిలోనూ ఉంది.