ముస్తాఫా… నో హ్యాపీస్ అట… రీజన్ ఇదే
ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పనులు జరిగేవట. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట అస్సలు లెక్క చేయడం లేదంటున్నారు ఈ వైైసీపీ ఎమ్మెల్యే. [more]
ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పనులు జరిగేవట. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట అస్సలు లెక్క చేయడం లేదంటున్నారు ఈ వైైసీపీ ఎమ్మెల్యే. [more]
ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పనులు జరిగేవట. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట అస్సలు లెక్క చేయడం లేదంటున్నారు ఈ వైైసీపీ ఎమ్మెల్యే. ఆయనే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా. ముస్తాఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించారు. అయినా తన నియోజకవర్గంలో ఏ పని జరగడం లేదని ముస్తాఫా సన్నిహితుల వద్ద వాపోతున్నారట. తన ప్రమేయం లేకుండానే నియోజకవర్గంలో నిర్ణయాలు జరిగిపోతున్నాయని ముస్తాఫా ఆవేదన చెందుతున్నారట.
విపక్షంలో ఉన్నప్పుడు …
గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ముస్తాఫా 2014లో వైసీపీ నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ముస్తాఫా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. నియోజకవర్గంలో పనుల కోసం అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావును సంప్రదించి కొద్దోగొప్పో పనులు ముస్తాఫా చేయించుకునే వారని చెబుతారు. అలాగని తనపై ఎంత వత్తిడి వచ్చినా ముస్తాఫా పార్టీ మారలేదు.
ఎంతమంది పార్టీని వీడినా….
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడినా ముస్తాఫా వీడలేదు. కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషాతో పాటు ముస్తాఫా కూడా వెళతారని కూడా అప్పట్లో ఆయన ప్రచారం జరిగింది. అయినా ముస్తాఫా తాను నమ్ముకున్న వైసీపీని వీడలేదు. 2019 ఎన్నికల్లో జగన్ తిరిగి ముస్తాఫాకే టిక్కెట్ ఇవ్వడం మరోసారి గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు ముస్తాఫా. కానీ ఏడాదిన్నర గడుస్తున్నా తన నియోజకవర్గంలో సమస్యలను తీర్చలేకపోతున్నానని ముస్తాఫా సన్నిహితుల వద్ద వాపోతున్నారట.
బయట వాళ్ల పెత్తనమే….
విపక్షంలో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలో మంచినీటి సమస్య తలెత్తినప్పుడు సొంత నిధులతో ముస్తాఫా ట్యాంకర్లతో సరఫరా చేయించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా శాశ్వత మంచినీటి పరిష్కారానికి ముస్తాఫా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇక్కడ బయటవాళ్ల పెత్తనమే ఎక్కువగా ఉందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. కొందరికి మాత్రమే పనులు జరుగుతున్నాయని ముస్తాఫా వాపోతున్నారు. మొత్తం మీద అధికారంలోకి రాకముందే ముస్తాఫా హ్యాపీగా ఉండేవారని ఆయన సన్నిహితులు ఛలోక్తులు విసురుతున్నారు.