ఈ ఎంపీని మరీ ఇంత డమ్మీని చేసేశారే ?
ఏపీలో వైసీపీ ఎంపీలు అంటేనే ఒకరిద్దరు మినహా చాలా మంది డమ్మీలు అన్నది తెలిసిందే. వీరిలో కొందరు తమంతట తాము డమ్మీలు అయితే మరి కొందరిని పార్టీలో [more]
ఏపీలో వైసీపీ ఎంపీలు అంటేనే ఒకరిద్దరు మినహా చాలా మంది డమ్మీలు అన్నది తెలిసిందే. వీరిలో కొందరు తమంతట తాము డమ్మీలు అయితే మరి కొందరిని పార్టీలో [more]
ఏపీలో వైసీపీ ఎంపీలు అంటేనే ఒకరిద్దరు మినహా చాలా మంది డమ్మీలు అన్నది తెలిసిందే. వీరిలో కొందరు తమంతట తాము డమ్మీలు అయితే మరి కొందరిని పార్టీలో కీలక నేతలు డమ్మీలను చేసేశారు. అసలు విషయంలోకి వెళితే విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్న వైసీపీ నాయకులు, ప్రముఖ నిర్మాత.. ఎంవీవీ సత్యనారాయణ ఏం చేస్తున్నారు ? ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదట. ఇదీ ఇప్పుడు విశాఖలో వినిపిస్తున్న మాట. ఆయన విశాఖ ఎంపీగా గెలిచారన్నమాటే కాని.. విజయసాయి, అవంతి ప్రెస్మీట్లలో పక్కన ఓ వార్డు స్థాయి లీడర్‌గా కనిపించడం మినహా చేసేదేం లేదు. కొన్నాళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్న సమయంలో ఎంవీవీ సత్యనారాయణ బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అయితే.. ప్రస్తుతం ఎంపీ విషయం మరోసారి చర్చకు వచ్చింది. దీనికి రీజనేంటంటే ప్రస్తుతం కరోనా సమయం నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం వెనక్కి వెళ్లినా.. త్వరలోనే దీనిపై కేంద్రం మళ్లీ పావులు కదిపే అవకాశం ఉంది.
స్టీల్ ప్లాంగ్ ఉద్యమం….?
దీంతో మళ్లీ విశాఖ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఉద్యోగులు రెడీ అయ్యారు. మరి ఇక్కడ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎక్కడున్నారని ఉద్యమకారులు వెతుకుతున్నా వారికి ఆయన అడ్రస్ కనుక్కోవడం కూడా గగనమైపోతోందట. ఆయన ఎంపీగా గెలిచి రెండేళ్లయినా.. ఇప్పటి వరకు ఇక్కడ చేసిందేమీ లేదని.. టీడీపీ నేతలు అంతర్గత ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఎంపీ కనపడడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నారు. దీంతో టీడీపీ దూకుడు ఎక్కువగా కనిపిస్తుండగా.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సత్యనారాయణ మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం.. పార్టీలో ఆయనను అదుపు చేస్తున్నార నే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఎన్నికలకు ముందు నుంచి కూడా ఇక్కడ పార్టీ కార్యక్రమాలను సాయిరెడ్డి చూస్తున్నారు.
ఆయన పాత్ర లేకుండానే…?
దీంతో విశాఖపై ఏం మాట్లాడాలన్నా.. తనే మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్‌పై ఉద్యమం తెరమీదకి వచ్చినప్పుడు కూడా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాత్రను పక్కకు తప్పించి.. సాయిరెడ్డే పాదయాత్ర చేశారు. అదే సమయంలో స్థానిక సమరం సాగినప్పుడు కూడా సాయిరెడ్డే అన్నీ అయి వ్యవహరించారు. కీలకమైన విశాఖ లోక్‌సభ సీటు నుంచి ఆయన ప్రాధినిత్యం వహిస్తున్నా కూడా మొన్న లోకల్ ఎన్నికల్లో ఆయన వర్గానికి నాలుగైదు కార్పొరేటర్ సీట్లు కూడా ఇప్పించుకోలేని స్థితిలో ఉన్నారు. అటు విజజయసాయి, ఇటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు అసలు ఎంపీని పట్టించుకోవడం లేదు. మధ్యలో ఆయన జగన్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు సరికదా.. ఏమన్నా ఉంటే విజయసాయితో మాట్లాడుకోమని చెప్పారట.
అందుకే ఆయన దూరంగా..?
ఈ పరిణామాలతోనే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హర్ట్ అవుతున్నారని తెలుస్తోంది. అందుకే నియోజకవర్గంలోనే ఉంటున్నా.. కూడా ఎక్కడికీ రావడం లేదని.. పార్టీలో ప్రాధాన్యం ఉందనే పేరు తప్ప తాను ఏం చేయాలన్నా… సాయిరెడ్డికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. చివరకు ఎంవీవీ సత్యనారాయణ టీడీపీ ఎంపీ వెలగపూడితో సీక్రెట్‌గా టచ్‌లో ఉండడంతో పాటు జాయింట్‌గా వ్యాపారాలు చేసుకుంటున్నారని మరో టాక్ కూడా ఉంది. చివరకు పోలీస్ కమిషనర్ సైతం ఎంపీ ఒక్క మాట చెప్పినా వినిపించుకోవడం లేదన్నది ఓపెన్ సీక్రెట్. పైగా ఇప్పుడు విశాఖ రాజధాని ప్రాంతం అని ప్రకటిస్తున్న సమయంలో మరో కీలక సలహాదారు కూడా ఇక్కడ హల్చల్ చేస్తుండడంతో వైజాగ్ ఎంపీ వాయిస్ కట్ అయిందని చెబుతున్నారు.