అక్కడ రెడ్లకే ఎంట్రీ… మిగిలినోళ్లకు నో ఛాన్స్…!
ఆ జిల్లాలో నడిచేదంతా రెడ్డి రాజ్యమే… అక్కడ పార్టీ ఏదైనా రెడ్ల హవానే నడుస్తుంది.. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల పదవులు అన్ని రెడ్లకే.. ఏ [more]
ఆ జిల్లాలో నడిచేదంతా రెడ్డి రాజ్యమే… అక్కడ పార్టీ ఏదైనా రెడ్ల హవానే నడుస్తుంది.. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల పదవులు అన్ని రెడ్లకే.. ఏ [more]
ఆ జిల్లాలో నడిచేదంతా రెడ్డి రాజ్యమే… అక్కడ పార్టీ ఏదైనా రెడ్ల హవానే నడుస్తుంది.. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల పదవులు అన్ని రెడ్లకే.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రెడ్డి మంత్రి తప్పకుండా ఉండాల్సిందే. గత కొన్ని దశాబ్దాలుగా ఆ జిల్లాలో మూడొంతుల నియోజకవర్గాల్లో రెడ్లు తప్ప మరో కులానికి చెందిన వారు పోటీ చేయలేదు అంటేనే అక్కడ రెడ్ల రాజకీయం ఎంతలా ఉందో అర్థమవుతోంది. అదే ఏపీ సీఎం జగన్మోహర్రెడ్డి సొంత జిల్లా కడప. కడప జిల్లాలో ముందు నుంచి పార్టీలతో సంబంధం లేకుండా రెడ్డి రాజ్యమే నడుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి నేతలే మంత్రులు.. రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచే మంత్రి అయ్యారు. తర్వాత వైఎస్ ఏకంగా ఇదే జిల్లా పులివెందుల నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.
ఏ నియోజకవర్గమైనా…?
వైఎస్ మరణాంతరం ఇదే జిల్లా నుంచి డీఎల్. రవీంద్రారెడ్డి, వైఎస్. వివేకానందరెడ్డి మంత్రులు అయ్యారు. ఇక టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ముందుగా ఎవ్వరికి మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. ఇక మేడా మల్లిఖార్జున రెడ్డి విప్‌గా ఉన్నారు. టీడీపీని పక్కన పెడితే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్సార్ సీపీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, కడప సీటు మైనార్టీకి వదిలేస్తే మిగిలిన అన్ని జనరల్ సీట్లు రెడ్లకు తప్ప మరొకరికి ఇవ్వడం లేదు. జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు లాంటి నియోజకవర్గాల్లో రెడ్డకు తప్ప మరో కులానికి సీటు ఇవ్వని పరిస్థితి. కడప ఎంపీ సీటు అయినా నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ, టీడీపీ రెడ్లకు మాత్రమే కట్టబెడుతున్నాయి.
వారిదే పెత్తనం…..
కాంగ్రెస్, వైసీపీ రెండు కూడా జిల్లాలో రెండు రిజర్వ్డ్ సీట్లు అయిన బద్వేల్, రైల్వేకోడూరు సీట్లు పక్కన పెట్టాక ఉన్న 8 జనరల్ సీట్లలో కడపను మైనార్టీలకు ఇస్తున్నారు. బద్వేలు రిజర్వ్ కాకముందే రెడ్లే గెలిచారు. ఇప్పుడు రిజర్వ్ అయినా అక్కడ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా ఉన్నా పెత్తనం అంతే ఎమ్మెల్సీ గోవిందారెడ్డిదే. రైల్వేకోడూరులో కొరుముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినా.. నాలుగు సార్లు గెలిచినా అక్కడ పెత్తనం కొల్లం గంగిరెడ్డి అండ్ అనుచరులదే. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న రిజర్వ్డ్ సీట్లలోనూ రెడ్లదే పెత్తనం. ఉన్నంతలో దివంగత వైఎస్సే నయం అనిపించారు. రాజంపేట ఎంపీ సీటు బలిజ వర్గానికి చెందిన సాయిప్రతాప్‌కు ఇచ్చారు. ఇక 1999లో నేత వర్గానికి చెందిన బండి హనుమంతుకు కడప ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఇక జగన్ వైఎస్సార్సీపీ పెట్టాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ కడప, రాజంపేట రెండు సీట్లు రెడ్లకే కట్టబెట్టేస్తున్నారు. రెండు రిజర్వ్, కడప మైనార్టీకి వదిలేస్తే అన్ని సీట్లు రెడ్లకే ఇస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ జగన్ తన రెడ్డి కులానికే పెద్ద పీట వేసుకున్నారు. అసలు బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
టీడీపీయే బెస్ట్…..
జిల్లా రాజకీయాల్లో టీడీపీ కూడా పెత్తనం ఎక్కువ సార్లు రెడ్లకే ఇచ్చినా బీసీలకు, బలిజలకు కూడా మంచి ప్రయార్టీయే ఇచ్చింది. రాయచోటిలో పాలకొండ్రాయుడు రెండు సార్లు ఎమ్మెల్యే అవ్వగా ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక 1999లో రాజంపేట ఎంపీగా గెలిచిన గునిపాటి రామయ్య సైతం బలిజ వర్గం నేతే. ఇక 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ ఎంపీగా పోటీ చేసిన డీకే సత్యప్రభ కూడా బలిజ వర్గం నేతే. సీ రామచంద్రయ్య సైతం రాజ్యసభకు వెళ్లారు. ఆయన కూడా బలిజ వర్గం నేతే.. ఇక మైదుకూరు సీటును టీడీపీ రెండు సార్లు బీసీ నేత అయిన పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఇచ్చింది. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఇక 1952 నుంచి కూడా జిల్లాలో ఒక్క బీసీ నేత కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. దీనిని బట్టి కడప జిల్లాలో రెడ్లు తప్పా మరో కులం నేత ఎదిగే పరిస్థితి లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.