లేటు వయసులో ఈ నిర్ణయమా…?
రాజకీయాలకు వయసుకు పెద్దగా సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో రిటైర్మెంట్ ఉండదు. ఓపిక ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగే వీలుంటుంది. కాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో [more]
రాజకీయాలకు వయసుకు పెద్దగా సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో రిటైర్మెంట్ ఉండదు. ఓపిక ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగే వీలుంటుంది. కాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో [more]
రాజకీయాలకు వయసుకు పెద్దగా సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో రిటైర్మెంట్ ఉండదు. ఓపిక ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగే వీలుంటుంది. కాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నాదెండ్ల భాస్కరరావు ఇప్పుడు తిరిగి రాజకీయాలవైపు చూడటం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్న విమర్శల నుంచి నాదెండ్ల భాస్కరరావు ఇప్పటికీ తప్పించుకోలేకపోతున్నారు.
వెన్నుపోటు ఉదంతంతో….
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు పెద్దగా క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేదు. 1978లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి నాదెండ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. 1983లో ఎన్టీరామారావుతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో నాదెండ్ల భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. అయితే ఏడాది గడవకముందే ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి స్థానం నుంచి దించివేయడంతో నాదెండ్ల పాపులర్ అయ్యారు.
చాలా కాలం తర్వాత…..
ఆ తర్వాత 1998లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత నుంచి నాదెండ్ల భాస్కరరావు రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయంగా క్రియాశీలం కావడంతో ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్లేనని అందరూ భావించారు. కాంగ్రెస్ పార్టీలోనే నాదెండ్ల భాస్కరరావు కొనసాగుతున్నారని చెప్పాలి. అయితే ఆయన ఎలాంటి పదవులు తీసుకోలేదు. పార్టీ ఇవ్వనూ లేదు.
ఎవరికి ఉపయోగం….?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాదెండ్ల కుమారుడు మనోహర్ జనసేన పార్టీలో చేరి కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే నాదెండ్ల అనూహ్యంగా బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆయన చూపు పడింది. ఆంధ్రప్రదేశ్ లో నాదెండ్ల భాస్కరరావును అనుకునే జనాలే లేరు. ఆయనకంటూ ప్రత్యేక వర్గమూ లేదు. బీజేపీ కూడా ఏపీలో పెద్దగా పట్టున్న పార్టీ కాదు. కానీ నాదెండ్ల భాస్కరరావు చేరడం వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండే అవకాశాలు లేవు గాని, వ్యక్తిగతంగా ఆయనకు కొంత అనుకూలమే అంటున్నారు విశ్లేషకులు.