జనసేనలో డిసైడ్ చేస్తోంది ఎవరు…?
అవును..ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్.. చేస్తోంది. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు పార్టీకి అన్నీతానే అయి వ్యవహరిస్తున్న విషయం అందరికీ [more]
అవును..ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్.. చేస్తోంది. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు పార్టీకి అన్నీతానే అయి వ్యవహరిస్తున్న విషయం అందరికీ [more]
అవును..ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్.. చేస్తోంది. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు పార్టీకి అన్నీతానే అయి వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీనికి కారణం.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకుల్లో నాదెండ్ల మనోహర్ ఒక్కరే కొంచెం దూకుడుగా ఉండాల్సిన బాధ్యతలు ఉన్న నాయకుడు. అయితే.. ఇప్పటి వరకు గడిచిన మూడు మాసాలుగా ఆయన యాక్టివ్గా ఉండలేకపోతున్నారనే వాదన ఉంది. పైగా.. కరోనా పేరుతో ఆయనతప్పించుకున్నారని కూడా విమర్శలు వచ్చాయి.
రెండు నెలల నుంచి….
నిజానికి పుంజుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న నేతలు.. ప్రజలకు చేరవ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీడీపీ.. ఈ వరుసలో ముందుంది. కరోనా ఉన్నప్పటికీ.. జూమ్ యాప్ద్వారా.. నేతలకు చేరువ అవుతోంది. ప్రజలకు కూడా అనేక సలహాలు సూచనలు చేస్తోంది. బీజేపీ కూడా అంతో ఇంతో ఇదే పనిచేస్తోంది. ఇక, కమ్యూనిస్టులు ఏదో ఒక రూపంలో ప్రజల మద్య ఉంటున్నారు. కానీ, జనసేన విషయానికి వస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉంది. రెండు నెలల నుంచి సైలెంట్ గా ఉంటున్నారు. అదేమంటే కరోనా పేరు చెబుతున్నారు.
బాధ్యతలన్నీ…..
మరోవైపు.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. పవన్ ఏకంగా ఐదు సినిమాలు లైన్లో పెట్టారు. ఈ సినిమాలన్ని కంప్లీట్ అయ్యే సరికి 2024 ఎన్నికలు వచ్చేస్తాయి. అయితే అప్పటి వరకు జనసేన పార్టీని అంతా నాదెండ్ల మనోహర్ మీదే పెట్టేశారు. పవన్ అటు సినిమాల్లో బిజీగా ఉంటే రాజకీయాలే కీలకంగా ఉన్న నాదెండ్ల ఏం చేస్తున్నారు? అనేది ప్రశ్న. ఇక, ఇటీవల జరిగిన.. జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ప్రకటించాల్సిన , చర్చించాల్సిన అంశాలను కూడా నాదెండ్ల మనోహర్ ముందుగానే చెప్పడం.. ఇప్పుడు ఈ చర్చకు కారణమైంది.
పార్టీ మొత్తాన్ని…
నీటియుద్దం, జాబ్ క్యాలెండర్.. వంటి కీలక అంశాలపై ముందుగా పవన్ మాట్లాడి.. తర్వాత.. అజెండాను ప్రకటించాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మాత్రం ముందుగానే ప్రకటించారు. అది కూడా టీడీపీ ప్రకటించిన విధంగానే ఉండడంతో ఆయన టీడీపీని కాపీకొడుతున్నారా ? లేక అలానే చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, నాదెండ్ల మనోహర్ ఇస్తున్న కాపీనే పవన్ చదువుతున్నారు. దీంతో ఇది పార్టీపై రాంగ్ సిగ్నల్లస్ పంపేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి నాదెండ్ల మనోహర్ పార్టీని నడిపిస్తున్నారా? అనేది తేలాల్సి ఉందని అంటున్నారు పవన్ అబిమానులు.