ఆయన షూటింగులో.. ఈయన మీటింగులో…?
ఇంటి పేరు ఒక్కటే. అటు అధినేతల ప్రొఫెషన్ కూడా ఒక్కటే. ఇదంతా చూస్తే పైలెట్, కో పైలెట్ అంటూ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన ఇద్దరు మాజీ [more]
ఇంటి పేరు ఒక్కటే. అటు అధినేతల ప్రొఫెషన్ కూడా ఒక్కటే. ఇదంతా చూస్తే పైలెట్, కో పైలెట్ అంటూ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన ఇద్దరు మాజీ [more]
ఇంటి పేరు ఒక్కటే. అటు అధినేతల ప్రొఫెషన్ కూడా ఒక్కటే. ఇదంతా చూస్తే పైలెట్, కో పైలెట్ అంటూ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కధ గుర్తుకు వస్తుంది. తెలుగు వల్లభుడిగా జన నీరాజనాలు అందుకున్న ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెట్టినపుడు ఆయన వెన్నంటి ఉన్న వారు నాదెండ్ల భాస్కరరావు. ఎన్టీయార్ కి రాజకీయాలు కొత్త. అప్పటికే ఆరితేరిపోయిన ఘటం నాదెండ్ల. పైగా కాంగ్రెస్ మహా సముద్రాన్ని ఈదేసి మరీ ఒడ్డుకు వచ్చిన రాజకీయ గజ ఈతగాడు ఆయన. ఎన్టీయార్ నమ్మకాన్ని అందిపుచ్చుకుని టీడీపీలో నంబర్ టూ అయ్యాడు.
అదే సీన్ రిపీట్…
ఇక చూసుకుంటే తెలుగు రాజకీయాల్లో మరో మారు అదే సీన్ రిపీట్ అవుతోంది. రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనను ఎంచుకున్నారు. ఆయనకు వైసీపీ టీడీపీ నుంచి అప్పట్లో ఆఫర్లు ఉన్నా కూడా పవన్ పార్టీని మెచ్చి చేరారు. నాటి నుంచి పవన్ కూడా ఆయన్ని బాగానే నమ్మారు, ఆదరిస్తున్నారు. పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా నాదెండ్ల మనోహర్ పక్కన ఉండాల్సిందే. పవన్ కి అన్ని విధాలుగా మార్గదర్శిగా ఉంటున్నారు జూనియర్ నాదెండ్ల.
వ్యూహం ఇదే …
అయితే పవన్ కళ్యాణ్ జనసేనకు ఇపుడు చేతిలో అధికారం లేదు. పార్టీ కూడా ఇంకా వేళ్ళూనుకోలేదు. అందువల్ల నాదెండ్ల మనోహర్ వంటి సీనియర్ అవసరం ఉందనే ఆయన్ని ముందు పెట్టి పవన్ కధ నడుపుతున్నారు అంటున్నారు. పైగా పవన్ రాజకీయ వ్యూహాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో కమ్మలు రాజకీయంగా ముందున్నారు, కాపులు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నా కూడా రాజకీయంగా వైసీపీని నిలువరించేందుకు కాపులు కమ్మల కాంబినేషన్ ని పవన్ కోరుకుంటున్నారు అంటున్నారు. తాను ఎటూ ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి నాదెండ్లను కూడా కీలకమైన పదవిలో ఉంచి జనాల్లోకి పంపిస్తే కమ్మలను ఆకట్టుకోవచ్చునని ఆయన తలపోస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే పవన్ వ్యూహం ఏదైనా రాజకీయ తెర మీద మాత్రం నాదెండ్ల మనోహర్ బాగానే వెలుగుతున్నారు.
అది కష్టమేనా…?
ఎన్టీయార్ కి పవన్ కి చాలా తేడా ఉంది. పైగా పవన్ రాజకీయంగా బాగానే ఆరితేరారు. అందువల్ల జూనియర్ నాదెండ్ల నుంచి ముప్పు ఏదీ రాకపోవచ్చు అని జనసేనలో వినిపిస్తున్న మాట. పైగా పార్టీ ఇంకా అధికారంలోకి రావాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఈ పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్లు పార్టీకి అవసరం అని అంతా ఒప్పుకుంటున్నారు. ఇక పవన్ వెండి తెర మీద నటించడం కూడా రాజకీయ అవసరాల కోసమే అయినపుడు పార్టీని జనంలో కొంతైనా కదిలించాలంటే నాదెండ్ల మనోహర్ లాంటి వారు ఉండి తీరాలి అంటున్నారు. అందువల్ల ఆయన షూటింగుల్లో ఉంటే ఈయన మీటింగుల్లో బిజీగా ఉంటున్నారు అని వినిపిస్తున్న మాట. మొత్తానికి నాదెండ్లకు కనుక పూర్తి స్వేచ్చ ఇస్తే జనసేన పొలిటికల్ పార్టీగా కొంత షేప్ రావడం ఖాయమని కూడా విశ్లేషిస్తున్నారు.