ఆ మాజీ మంత్రికి చంద్రబాబు షాక్.. నియోజకవర్గం మార్పు?
ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రత్తిపాడులో టీడీపీకి గత రెండు దశాబ్దాలుగా సమీకరణలు కలిసి [more]
ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రత్తిపాడులో టీడీపీకి గత రెండు దశాబ్దాలుగా సమీకరణలు కలిసి [more]
ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రత్తిపాడులో టీడీపీకి గత రెండు దశాబ్దాలుగా సమీకరణలు కలిసి రావడం లేదు. ఇక్కడ పార్టీ తరపున గెలిచిన వాళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. 2004 వరకు ఇక్కడ పార్టీని నడిపించిన మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య వైసీపీలోకి వెళ్లి తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయన ఓసీ నేత అయినా ప్రస్తుతం పార్టీకి ఎవ్వరూ దిక్కులేక నియోజకవర్గ ఇన్చార్జ్గా కంటిన్యూ అవుతున్నారు. 2009, 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కందుకూరు వీరయ్య పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పార్టీకి దూరంగా ఉంచారు.
అందరూ పార్టీ మారడంతో…..
2014లో పోటీ చేసి ఏకంగా మంత్రి అయిన రావెల కిషోర్‌బాబుపై కూడా మంత్రిగా ఉండగానే పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఆ తర్వాత ఆయన వయా జనసేన టు బీజేపీలోకి వెళ్లిపోయారు. గత ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలతో అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు సీటు ఇవ్వగా ఆయన ఎన్నికల్లో ఓడిన వెంటనే ఎమ్మెల్సీ వదులుకుని మరీ వైసీపీకి జంప్ కొట్టేశారు. మళ్లీ టీడీపీ అనాథ అయిపోవడంతో చంద్రబాబు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ ఇక్కడ స్థానిక ఎన్నికలు ఎదుర్కొంది.
గుంటూరు వాసి కావడంతో….
ఇదిలా ఉంటే ప్రత్తిపాడు నుంచి ప్రస్తుతం హోం మంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె దశాబ్దంన్నర కాలంగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చక్రం తిప్పుతున్నారు. గుంటూరు నగరాన్ని ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే ఇప్పుడు పార్టీని నడిపించే నాథుడు లేక డీలా పడడంతో చంద్రబాబు / జిల్లా పార్టీ పెద్దలు ఇక్కడ పార్టీ పగ్గాలు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు అప్పగించాలని చూస్తున్నారు. ఆనంద్‌బాబు గుంటూరు వాసే… ఆయన గతంలో నగరంలో కార్పొరేటర్‌గా కూడా గెలిచారు.
వేమూరులో రెండుసార్లు…..
2009 ఎన్నికల్లోనే ఆయనకు ప్రత్తిపాడు ఇవ్వాలనుకున్నా ఆయన రాజకీయ గురువు ఆలపాటి రాజా చక్రం తిప్పడంతో ఆయనకు వేమూరు సీటు ఇచ్చారు. అక్కడ రెండు సార్లు గెలిచిన ఆనంద్‌బాబు గత ఎన్నికల్లో ఓడిపోయారు. గుంటూరులో ఉంటోన్న ఆయనకు వేమూరు చాలా దూరం.. అదే ప్రత్తిపాడులో అయితే గుంటూరు నుంచే రాజకీయం చక్కపెట్టేయవచ్చు. దీంతో పాటు అటు సమీకరణలు… ఇటు హోం మంత్రిని ధీటుగా ఎదుర్కోవాలంటే జిల్లా ఎస్సీ వర్గంలోనే కాకుండా… పార్టీలో మంచి పట్టు ఉండడం.. అటు వివాద రహితుడిగా ఉండడంతో ఆనంద్‌బాబు అయితేనే కరెక్ట్ అని అటు అధిష్టానం, ఇటు జిల్లా నాయకత్వం నిర్ణయానికి వచ్చిందట.
కొత్త నియోజకవర్గమైనా…?
వేమూరు నుంచి పోటీకి ఈ సారి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. నిన్నటి వరకు ప్రత్తిపాడులో పార్టీకి బలమైన నేతగా ఉంటారనుకున్న డొక్కా కూడా కండువా మార్చేయడంతో ఇప్పుడు నక్కా ఆనంద్‌బాబుకు ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇటు ఆయన కూడా ప్రత్తిపాడు పగ్గాలు స్వీకరించేందుకే ఆసక్తితో ఉన్నారని కూడా తెలుస్తోంది. మరి ఆనంద్‌బాబుకు కొత్త నియోజకవర్గంలో రాజకీయం ఎలా కలిసొస్తుందో ? చూడాలి