ప్రసన్నకు ఇది కొత్తేమీ కాదు.. ఆయనంటేనే ఈయనకు మంట
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎప్పుడూ డిఫరెంటే. ఆయన అధికారంలో ఉన్నా తన మససులో ఏదీ దాచుకోరు. పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించరు. అందుకే ఆయన [more]
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎప్పుడూ డిఫరెంటే. ఆయన అధికారంలో ఉన్నా తన మససులో ఏదీ దాచుకోరు. పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించరు. అందుకే ఆయన [more]
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎప్పుడూ డిఫరెంటే. ఆయన అధికారంలో ఉన్నా తన మససులో ఏదీ దాచుకోరు. పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించరు. అందుకే ఆయన కామెంట్స్ తరచూ వివాదంగా మారుతున్నాయి. ఇంతకీ ప్రసన్న కుమార్ రెడ్డి టార్గెట్ చేసింది ఎవరిని? పోలీసులనా? పోలీసులను వెనకుండి నడిపిస్తున్న సొంత పార్టీ నేతలనా? లేక మాజీ మంత్రులనా? అన్నది పార్టీ చర్చనీయాంశంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ కేసు….
డీసీఎంఎస్ ఛైర్మన్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగితే దానికి బాధ్యులుగా టీడీపీ నేతలు అని వైసీపీ నేతలు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వత్తిడి తెచ్చారు. ఈ సమయంలో ఎస్పీ నుంచి కేసు నమోదు చేయవద్దని ఆదేశాలు రావడంతో కేసు నమోదు చేయలేదు. ఇదే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోన్ చేయడంతోనే ఆయన కేసు నమోదు చేయవద్దని చెప్పారని ప్రచారం జరుగుతోంది.
ధర్మాకు దిగి…..
ఎస్పీపై ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంతకాలం ఉంటావో చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. నిజానికి కొద్ది నెలలుగా ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు బాస్ లపై ఫైర్ అవ్వడం ఇది తొలిసారి కాదు. గతంలో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిన్న కోవూరు నియోజకవర్గం పరిధిలో ప్రసన్న కుమార్ రెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అయితే ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్స్ ను పాటించలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా పట్టించుకోలేదని వార్తలు రావడంతో ఉన్నతాధికారులు ఎమ్మెల్యేతో పాటు పోలీసులకు కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి అభ్యంతరం చెబుతూ తాను మంచి పనిచేస్తున్నా నోటీసులు ఏంటని ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులకు మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
లాక్ డౌన్ సమయంలోనూ….
ఆ తర్వాత మరో సంఘటన జరిగింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని అధికారులపై కేసులు నమోదు చేయడంపై ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు నియోజకవర్గంలో కొందరు అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీహార్ నుంచి వచ్చిన ఎస్పీ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు. దమ్ముంటే తనపై కేసు నమోదు చేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. అధికారులపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టార్గెట్ ఎస్పీ అనే అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య గ్యాప్ ను పూడ్చేందుకు జిల్లాలో ఎవరూ ప్రయత్నించలేదన్నది వాస్తవం. అందుకే తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.