Nallari : నల్లారి అనుకోకుండానే జగన్ కు హెల్ప్ అయ్యారా?
తెలుగుదేశం పార్టీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు వదిలిన బాణంగా ఆయన కొన్నేళ్ల తర్వాత మీడియా ముందుకు [more]
తెలుగుదేశం పార్టీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు వదిలిన బాణంగా ఆయన కొన్నేళ్ల తర్వాత మీడియా ముందుకు [more]
తెలుగుదేశం పార్టీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు వదిలిన బాణంగా ఆయన కొన్నేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రెడ్డి సామాజికవర్గంపై ఆయన చేసిన కామెంట్స్ కొంచెం వేడిపుట్టించేవిగానే ఉన్నాయి. వైసీపీ లో ఉన్నవాళ్లంతా కల్తీ రెడ్లు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వైసీపీ నెత్తిన పాలుపోశారంటున్నారు.
రెడ్లలో అసంతృప్తిని….
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. రెడ్డి ప్రభుత్వం వచ్చిందని భావిస్తున్నా జగన్ వారికి పెద్దగా ఉపయోగపడింది లేదు. పదవులు, పనుల్లో ఇతర సామాజికవర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. తమను ఏ రకంగా జగన్ పట్టించుకోవడం లేదని, తాము అన్ని రకాలుగా నష్టపోయి పార్టీని అధికారంలోకి తెస్తే తమను దూరం చేస్తున్నారన్న ఆవేదన ఉంది. ఈ సమయంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కామెంట్స్ వారిలో వేడి పుట్టించాయంటున్నారు.
వీరా పెద్ద రెడ్లు…
తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలను సమర్థించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా వైసీపీలో ఉన్న వాళ్లంతా కల్తీ రెడ్లు అని అనడంతో వారిలో కొంత ఆగ్రహం కనపడుతుంది. టీడీపీలో ఉన్న నిఖార్సయిన రెడ్లు ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమర్ నాధ్ రెడ్డి వీళ్లా అసలైన రెడ్లు అని వారు నిలదీస్తున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కుటుంబం తప్ప ఏ రెడ్డి బాగుపడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నల్లారిపై ఆగ్రహం….
రాయలసీమలోని రెడ్లు జగన్ కు వ్యతిరేకంగా ఏకమవుతారని ఆయన అనడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేతిలో పావుగా మారిపోయారంటున్నారు. టీడీపీలో ఉన్న వారు పెద్ద రెడ్లు కాదని, పిచ్చి రెడ్లు అని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతల్లో ఉన్న అసంతృప్తిని జగన్ ప్రమేయం లేకుండానే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోగొట్టారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.