అప్పటిదాకా ఈయన రాడా?
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీలో చేరారు. పీలేరు నియోజకవర్గంలో పట్టున్న నల్లారి కుటుంబం టీడీపీలో చేరి కంచుకోటను కాపాడుకోవాలనుకుంది. కానీ జగన్ [more]
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీలో చేరారు. పీలేరు నియోజకవర్గంలో పట్టున్న నల్లారి కుటుంబం టీడీపీలో చేరి కంచుకోటను కాపాడుకోవాలనుకుంది. కానీ జగన్ [more]
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీలో చేరారు. పీలేరు నియోజకవర్గంలో పట్టున్న నల్లారి కుటుంబం టీడీపీలో చేరి కంచుకోటను కాపాడుకోవాలనుకుంది. కానీ జగన్ హవా ముందు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పీలేరు నియోజకవర్గానికి పెద్దగా రావడం లేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజా చైతన్య కార్యక్రమాలకు కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు.
శత్రువు కోసమే…?
నిజానికి తెలుగుదేశం పార్టీకి, నల్లారి కుటుంబానికి పడకపోయినా తమ ప్రధాన శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉండటంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉండగా టీడీపీలో చేరిపోయారు. అప్పటి మంత్రి అమర్ నాధ్ రెడ్డి వత్తిడితో ఆయన టీడీపీ కండువా కప్పేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సలహాతోనే ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నల్లారి కుటుంబంపై ప్రశంసలు కూడా కురిపించారు.
నామినేటెడ్ పదవి పొంది…..
పార్టీలో చేరిన వెంటనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నామినేటెడ్ పదవి ఇచ్చారు. కేబినెట్ హాదా ఉండటంతో ఆయన పీలేరు నియోజకవర్గాన్ని వదలకుండా తిరిగారు. ఇక ఎన్నికల సమయంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేరుతో పాటు పుంగనూరు బాధ్యతలను అప్పగించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని గట్టిగానే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు. అయినా చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా మరే నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించలేక పోయింది.
పత్తా లేకుండా…..
దీంతో మనస్తాపానికి గురైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబును కలిసిందీ లేదు. తాజాగా ప్రజా చైతన్య యాత్రలను కూడా పీలేరు నియోజకవర్గంలో జరపలేదు. చంద్రగిరి, పుంగనూరు, మదనపల్లె, కుప్పం, సత్యవేడు నియోజకవర్గాల్లోనే తొలిరోజు ఈ యాత్రలు జరిగాయి. పీలేరులో మాత్రం జరగలేదు. ఇక ఎన్నికలకు ముందే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి యాక్టివ్ అవుతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు కూడా నల్లారిని టచ్ చేసే ఆలోచనలో లేరు.