నల్లారిని అందుకే నెగ్లెట్ చేశారట
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి కూడా చంద్రబాబు గౌరవించారు. అప్పుడే వచ్చిన వారకి పదవి ఇవ్వడంతో [more]
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి కూడా చంద్రబాబు గౌరవించారు. అప్పుడే వచ్చిన వారకి పదవి ఇవ్వడంతో [more]
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి కూడా చంద్రబాబు గౌరవించారు. అప్పుడే వచ్చిన వారకి పదవి ఇవ్వడంతో చిత్తూరు జిల్లా టీడీపీలో కొందరు నేతలు అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. అయినా అధికారంలో ఉండటంతో కిమ్మనలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొనాలంటే నల్లారిని దరిచేర్చుకోవాలన్న చంద్రబాబు వ్యూహం 2019 ఎన్నికల్లో పనిచేయలేదు. చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా అన్ని స్థానాల్లో టీడీపీ దారుణ ఓటమిని చవి చూసింది.
పదవుల విషయంలో….
అయితే చంద్రబాబు తాజాగా భర్తీ చేసిన పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను పరిశీలిస్తే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని చంద్రబాబు పక్కన పెట్టారనే తెలుస్తోంది. నిజానికి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడిగా నల్లారికి కాని, ఆయన కుమారుడికి కానీ ఇస్తారని అందరూ భావించారు. మొన్న ఎన్నికల్లోనే నల్లాకి కిషోర్ కుమార్ రెడ్డి తన కుమారుడు రాజంపేట పార్లమెంటుకు పోటీ చేయించాలనుకున్నారు.
అప్పట్లో హామీ ఇచ్చి…..
కానీ అప్పుడు డీకే ఆదికేశవులునాయుడు సతీమణి సత్యప్రభకు టిక్కెట్ ఇవ్వాల్సి రావడంతో ఆ ప్రతిపాదనను చంద్రబాబు సున్నితంగా తోసిపుచ్చారు. దీంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొంత హర్ట్ అయ్యారంటారు. కానీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేరు, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల బాధ్యతను కూడా అప్పగించారు. ఈ మూడు చోట్ల గెలిపించుకుని రావాలని నల్లారి కిషోర్ కు అప్పగించారు. అధికారంలోకి వస్తే కుమారుడి రాజకీయ భవిష్యత్ ను తాను చూసుకుంటానని చంద్రబాబు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. అయితే ఎక్కడా గెలవలేదు.
పార్టీని పట్టించుకోక పోవడంతో…..
ఇక అప్పటి నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా లేరు. పీలేరు నియోజకవర్గానికి కూడా రావడం లేదు. క్యాడర్ నుపట్టించుకోవడం లేదు. పార్టీ కార్కక్రమాలను నిర్వహించడం కోసం కూడా పీలేరు రావడం లేదు. తన ముఖ్యమైన అనుచరులతో తప్ప నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎవరికీ ఫోన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదంటున్నారు. దీంతోనే చంద్రబాబు పదవుల విషయంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే రాజంపేట పార్లమెంటు కమిటీ పదవి దక్కేదని అంటున్నారు.