ఎవరీ తాలిబన్లు ?
ప్రపంచవ్యాప్తంగా గత రెండు దశాబ్దాల నుంచి తాలిబన్ల పేరు మార్మోగుతోంది. అసలు ఈ పేరు చెబితేనే కొన్ని దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఉగ్రవాద దాడులతో ఈ సంస్థ అనేక [more]
ప్రపంచవ్యాప్తంగా గత రెండు దశాబ్దాల నుంచి తాలిబన్ల పేరు మార్మోగుతోంది. అసలు ఈ పేరు చెబితేనే కొన్ని దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఉగ్రవాద దాడులతో ఈ సంస్థ అనేక [more]
ప్రపంచవ్యాప్తంగా గత రెండు దశాబ్దాల నుంచి తాలిబన్ల పేరు మార్మోగుతోంది. అసలు ఈ పేరు చెబితేనే కొన్ని దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఉగ్రవాద దాడులతో ఈ సంస్థ అనేక దేశాల్లో దురాగతాలకు పాల్పడుతోంది. ఇరవయ్యేళ్లుగా ఏకంగా అఫ్గానిస్థాన్ లో తిష్ట వేసింది. ఈ మధ్య ఆసియా దేశంపై తన పట్టు పెంచుకుంటోంది. తాజాగా అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగుతుండటంతో తాలిబన్లకు తిరుగులేకుండా పోతోంది. దేశంలోని మొత్తం 398 జిల్లాలకుగాను దాదాపు 198 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉన్నాయి. 130 జిల్లాల్లో తాలిబన్లు, అఫ్గాన్ సైనికుల మధ్య పతాకస్థాయిలో పోరు జరుగుతోంది.
మళ్లీ అదుపు తప్పుతుందా?
మరోపక్క ఆగస్టు 31 నాటికి తమ దళాలు పూర్తిగా వైదొలగుతాయన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన అఫ్గాన్ వాసులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పడే పరిస్థితి ఇలా ఉంటే ఇక అమెరికా దళాలు పూర్తిగా వెనక్క మళ్లితే పరిస్థితి మరింత దిగజారుతుందని, తాలిబన్లకు అడ్డూ అదుపు ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాల పోరాటంలో అమెరికా బావుకున్నది ఏమీ లేదు. వందల కోట్ల డాలర్లు వ్యయం చేసింది. వందలమంది అమెరికా సైనికులు నేలకొరిగారు. వేలమంది క్షతగాత్రులయ్యారు.
బహిరంగంగా ఉరిశిక్షలు….?
ఈ నేపథ్యంలో అసలు తాలిబన్లు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్కంఠ కలిగిస్తాయి. 1990ల్లో అఫ్గాన్ నుంచి నాటి సోవియట్ యనియన్ సేనలు వైదొలగాక ఉత్తర ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల కోసం తాలిబన్లు రంగంలోకి దిగారు. క్రమంగా ఇది అతివాద సున్నీ మత సంస్థల చేతిలోకి వెళ్లి ంది. దీనికి సంపన్న దేశమైన సౌదీ అరేబియా నుంచి విరాళాలు దండిగా వచ్చేవి. తొలిరోజుల్లో తాలిబన్లు ప్రజల సంక్షేమం కోసం పరితపించేవారు. అవి నీతిని నిర్మూలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునే వారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం రవాణా సౌకర్యాలు కల్పించారు. తద్వారా ప్రజలకు చేరువయ్యారు. కాలక్రమంలో పరిస్థితి మారింది. ప్రజల సంక్షేమం బదులు వారిపై పెత్తనం చేయడం మొదలు పెట్టారు. ఆధిపత్య ప్రదర్శన ప్రారంభమైంది. మహిళలు బయటకు రాకూడదని, బురఖాలు ధరించాలని, బాలికలు విద్యను అభ్యసించరాదంటూ అర్థరహితమైన ఆంక్షలు విధించడం మొదలు పెట్టారు. తీవ్రాతీవ్రమైన ఆంక్షలు, శిక్షలు విధించడం ప్రారంభించారు. ఛాందసవాదం పెరిగిపోయింది. మత మౌఢ్యం జడలు విప్పింది. బహిరంంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్నారు.
అంతర్జాతీయ సమాజాన్ని…?
ఈ పరిస్థితులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అఫ్గాన్ మనకు పొరుగు దేశం. కొన్ని వందల కిలోమీటర్ల సరిహద్దును ఆ దేశంతో పంచుకుంటోంది. అఫ్గాన్ లో సుమారు 2200 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అనేక అభివద్ధి పనులు ప్రారంభించింది. ఏకంగా అఫ్గాన్ కు వందల కోట్ల రూపాయల వ్యయంతో పార్లమెంటు భవనాన్ని నిర్మించి ఇచ్చింది. దీనిని ఏపీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఒక సాగునీటి ప్రాజెక్టునూ నిర్మించింది. కీలకమైన రహదారులను నిర్మించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్ తాలిబన్లకు అండదండలు అందిస్తోంది. భారత్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న పాకిస్థాన్ అమెరికా దళాలు వైదొలగడాన్ని అవకాశంగా తీసుకుని రెచ్చిపోయే ప్రమాదం లేక
పోలేదు. అందువల్ల భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చైనా తమకు మిత్రదేశమన్న తాలిబన్ల ప్రకటన మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పక్క అఫ్గాన్ ప్రగతికి పాటుపడుతూనే మరో పక్క భారత్ తన భద్రతను కాచుకోవడం తప్పనిసరి.
-ఎడిటోరియల్ డెస్క్