బాలయ్య బిగ్ సౌండ్ ఎవరి మీద ?
బాలకృష్ణ నట సింహ. కమ్ రాజకీయ నేత. ఆయన తండ్రి స్థాపించిన టీడీపీలో తాజాగా పొలిట్ బ్యూరో మెంబర్ కూడా అయ్యారు. మొత్తానికి పాతికమందిలో ఒకరుగా బాలయ్యను [more]
బాలకృష్ణ నట సింహ. కమ్ రాజకీయ నేత. ఆయన తండ్రి స్థాపించిన టీడీపీలో తాజాగా పొలిట్ బ్యూరో మెంబర్ కూడా అయ్యారు. మొత్తానికి పాతికమందిలో ఒకరుగా బాలయ్యను [more]
బాలకృష్ణ నట సింహ. కమ్ రాజకీయ నేత. ఆయన తండ్రి స్థాపించిన టీడీపీలో తాజాగా పొలిట్ బ్యూరో మెంబర్ కూడా అయ్యారు. మొత్తానికి పాతికమందిలో ఒకరుగా బాలయ్యను చేసి బావ చంద్రబాబు అదే ఎక్కువ అన్నట్లుగా పార్టీ జనాలకు చూపిస్తున్నారు. మరో వైపు తన కొడుకు లోకేష్ ని ఫ్యూచర్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్టీయార్ అసలైన వారసున్ని అంతమేరా తగ్గించేస్తున్నారు. దాంతో బాలకృష్ణ గుస్సా అయ్యారని తాజా టాక్. టీడీపీ గెలిచినపుడు బాబుకు ఎవరూ కనిపించరు, ఇక ఓడినా కూడా బాలకృష్ణ లాంటి వారి సినీ గ్లామర్ ఉన్న వారి అవసరం లేదా అన్నదే నందమూరి ఫ్యాన్స్ ఆవేదనట.
డుమ్మాతో ఝలక్…..
బాలకృష్ణ మెతకతనం, బావయ్యని నమ్మిన అతి మంచితనమే ఇపుడు కొంప ముంచబోతున్నాయా అన్నదే ఆయనను అభిమానించేవారిలో కలుగుతున్నా ఆందోళనట. చంద్రబాబు వరకూ పార్టీ సారధ్యానికి ఓకే అయినా ఆ తరువాత బాలయ్య కదా సీనియర్. పైగా,నందమూరి వారి సిసలైన వారసుడు. అటువంటి బాలయ్యని పార్టీలో ఒక మూలకు నెట్టేసి తన కుమారుడుని గట్టిగా ముందుకు తెస్తున్నా చంద్రబాబు పోకడల పట్ల బాలకృష్ణ కు ఎంతో కాలంగా గుర్రు ఉంది. అందుకే ఆయన తాను తొలిసారి పొలిట్ బ్యూరో మెంబర్ గా నియమితుడైన తరువాత జరిగిన తొలి మీటింగుకే డుమ్మా కొట్టేశారు. ఆ విధంగా తన అసంతృప్తిని ఆయన బావకు గట్టిగానే తెలియచేశారు అంటున్నారు.
చాప్టర్ క్లోజ్…
పార్టీలో ఇదే తీరున నెమ్మదిగా ఉంటే వచ్చే ఎన్నికల్లో హిందూపురం టికెట్ కూడా బావయ్య చంద్రబాబు ఇవ్వరని బావమరిది బాలకృష్ణ కు పూర్తిగా బోధపడిపోయింది. అందుకే ఆయన ఇపుడు హఠాత్తుగా బిగ్ సౌండ్ చేస్తున్నారు. తన హిందూపూర్ నియోజకవర్గంలో తాజాగా పర్యటనలూ షురూ చేశారు. ఇక వైసీపీ మంత్రి కొడాలి నానికి హెచ్చరికలు పంపించడం వెనక టీడీపీ పౌరుషం తనలోనే ఉందని చాటి బాలకృష్ణ చెబుతున్నారు. తాను టీడీపీ నుంచి గట్టి కౌంటర్లు పంపగలను అని కూడా తెలియచేస్తున్నారు. కొడాలి నాని మీద బావ చంద్రబాబు. లోకేష్ నోరు విప్పలేకపోతున్నారు అని పార్టీ వర్గాలకు సందేశం ఇవ్వడమూ బాలయ్య తాజా గర్జనలో ఉందని చెబుతున్నారు.
ఈసారి సంచలనమే….
చంద్రబాబు దగ్గర పార్టీ నాయకులు ఇదివరకులా జడవడంలేదు. ఆయన జిల్లాల పర్యటనలు చేస్తే కీలక నాయకులు కూడా డుమ్మా కొడుతున్నారు. ఇక బాబు ఇచ్చే పిలుపులకు స్పందించే సీన్ కూడా పెద్దగా లేదు. ఇదంతా రెడేళ్ళ వ్యవధిలో దిగజారిన బాబు ట్రాక్ రికార్డుని చూసే అని చెప్పేయవచ్చు. మరి వారిలో లేని భయాలూ, బెరుకులూ బాలకృష్ణ లో మాత్రం ఎందుకు ఉండాలి. అందుకే ఈ నట సింహ జూలు విదిలిస్తున్నారు. బాబు అసక్తతను చూసి తానూ బాణాలు వేయాలని భావిస్తున్నారు. వర్కౌట్ అయితే టీడీపీలో బాలకృష్ణ శకం మొదలవుతుంది. కాకపోయినా ఇంతకంటే పోయేది ఏదీ లేదు. ఈ లెక్కలతోనే బావ మీద బాలయ్య తాజాగా గర్జిస్తున్నాడు అంటున్నాడు. మరి రాజకీయ చాణక్యుడు అయిన చంద్రబాబు రీల్ హీరో సింహ గర్జనలకు బెదిరిపోతారా.