Nandamuri : బాలయ్య బోళా మనిషి… చిన్న పిల్లాడి మాదిరిగానే?
నందమూరి బాలకృష్ణ మనసు మంచిది. ఆయన భావోద్వేగాలకు గురవుతారు కాని ఆయనకు కుట్రలు, కుతంత్రాలు వంటివి తెలియవంటారు. సినీ పరిశ్రమలోనైనా, రాజకీయాల్లోనైనా ఆయన తాను అనుకున్నది మొహం [more]
నందమూరి బాలకృష్ణ మనసు మంచిది. ఆయన భావోద్వేగాలకు గురవుతారు కాని ఆయనకు కుట్రలు, కుతంత్రాలు వంటివి తెలియవంటారు. సినీ పరిశ్రమలోనైనా, రాజకీయాల్లోనైనా ఆయన తాను అనుకున్నది మొహం [more]
నందమూరి బాలకృష్ణ మనసు మంచిది. ఆయన భావోద్వేగాలకు గురవుతారు కాని ఆయనకు కుట్రలు, కుతంత్రాలు వంటివి తెలియవంటారు. సినీ పరిశ్రమలోనైనా, రాజకీయాల్లోనైనా ఆయన తాను అనుకున్నది మొహం మీదే చెప్పేస్తారు. ఉన్నది ఉన్నట్లు బయటకు అనేస్తారు. ఇది కొన్నిసార్లు ఆయనకు ఇబ్బందికరంగా మారొచ్చు. కానీ ఆయనను దగ్గర నుంచి చూసిన వారెవరైనా ప్రేమించక మానరంటారు. ప్రత్యర్థులు సయితం బాలయ్యను ఆఫ్ ది రికార్డులో పొగుడుతారు.
ఎవరికీ హాని…..?
బాలకృష్ణ భోళా మనిషి. ఆయన ఎవరికీ హాని చేయరు. ఆయన ప్రేమిస్తే ప్రాణమిస్తారు. ఇది సినీ పరిశ్రమలో ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెప్పే మాటలు. ఇక ఇటీవల ఒక టీవీ షోలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బాలకృష్ణకు ఫోన్ చేసిన తర్వాత ఆమె బాలయ్యను తెగపొగిడేశారు. బాలకృష్ణ వంటి వారు అరుదుగా ఉంటారన్నారు రోజా. రోజా రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. తనకు తెలిసిన బాలయ్య గురించే ఆమె చెప్పారు.
రాజకీయాల్లోనూ అంతే….
ఇలా బాలకృష్ణ రాజకీయాల్లోనూ అంతే. మైకు దొరికితే ఏదంటే అది మాట్లాడేస్తారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని అసలు ఆలోచించరు. హిందూపురం నియోజకవర్గంలోనూ బాలయ్య పర్యటన ఉందంటే అక్కడి పార్టీ నేతలకు, కార్యకర్తలకు పండగే. తనకు చిరాకేసినప్పుడు చెంప చెళ్లుమనిపించినా వెంటనే వారిని అక్కున చేర్చుకుంటారు. కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారన్నది హిందూపరం టీడీపీ నేతలు చెప్పే మాట.
కుట్రలు.. కుతంత్రాలు….
అసలు బాలయ్యకు కుట్రలు, కుతంత్రాలు తెలిసి ఉంటే టీడీపీకే అధ్యక్షుడయ్యేవారనే వారు కూడా లేకపోలేదు. బాలకృష్ణకు సినిమా అంటే ప్రాణం. అదే లోకం. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. రాజకీయం ఆయనకు చేతకాదు. అందుకే పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. తన బావ చంద్రబాబు 36 గంటల దీక్ష చేసినా అటువైపు రాలేదు. పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపైన కూడా బాలకృష్ణ స్పందించలేదు. రాజకీయాలంటే విరక్తి కలుగుతుందని ఆయన సన్నిహితులతో అంటున్నారట.