టీడీపీతో చేతులు కలిపిన వైసీపీ ఎమ్మెల్యే.. ఎలాగంటే?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిముషానికి ఏదైనా జరగొచ్చని.. రాజకీయ పండితులు చెబుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిణామమే వైసీపీలోనూ జరుగుతోంది. కర్నూలు జిల్లాలోని [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిముషానికి ఏదైనా జరగొచ్చని.. రాజకీయ పండితులు చెబుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిణామమే వైసీపీలోనూ జరుగుతోంది. కర్నూలు జిల్లాలోని [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిముషానికి ఏదైనా జరగొచ్చని.. రాజకీయ పండితులు చెబుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిణామమే వైసీపీలోనూ జరుగుతోంది. కర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరులో వైసీపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్థర్.. ఇప్పుడు టీడీపీ నేతలతో చేతులు కలిపారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీనిపై వైసీపీ నాయకులు కూడా సీరియస్‌గానే దృష్టి పెట్టారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోందనే విషయంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశాయి. నియోజకవర్గంలో కొన్నాళ్లుగా అగ్రవర్ణ రాజకీయ పెత్తనం సాగుతున్న మాట వాస్తవం.
అంతా ఆయనదే…..
ఒకప్పుడు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఇక్కడ టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ విజయాలు సాధించాయి. వైసీపీ ఆవిర్భవించాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయాలతో దూసుకుపోతోంది. అయితే గత ఎన్నికలకు ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీలోకి వచ్చారు. వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్యేనే చక్రం తిప్పాలి. కానీ, అన్నీ కూడా సిద్ధార్థ రెడ్డే పార్టీ ఇంచార్జ్‌గా చక్రం తిప్పుతున్నారు. అధికారులతో పనులు చేయించుకోవడం నుంచి కాంట్రాక్టులను కట్టబెట్టే వరకు కూడా అన్నీ తానై సిద్ధార్థ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్యే నామమాత్రంగా….
చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో మూడొంతుల పదవులు, అభ్యర్థులు కూడా బైరెడ్డి వర్గానికే దక్కాయి. దీంతో ఆర్థర్ పూర్తి నామమాత్రం అయ్యారు. ఈ విషయంపై బైరెడ్డి నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకున్నా జిల్లా ఇన్చార్జ్ మంత్రుల నుంచి, వైసీపీ అధిష్టానం వరకు అందరూ బైరెడ్డికే సపోర్ట్ చేయడంతో ఆర్థర్ పాత్ర మరింత నామమాత్రం అయ్యింది. ఇలా అనేక సందర్భాల్లోనూ పార్టీలోనూ పైచేయి ఆయనదే అన్నట్టుగా సాగింది. దీంతో నిత్యం అటు ఆర్థర్, ఇటు సిద్ధార్థ రెడ్డిలు రాజకీయంగా ఒకరితో ఒకరు విభేదించుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్ల కిందట దీనిపై పంచాయతీ ఏకంగా జగన్ వద్దకు చేరింది.
టీడీపీ మద్దతుతో…..
ఆయన ఎటూ తేల్చకుండా.. సర్దుకుపోవాలని చెప్పారు. ఈ క్రమంలో సిద్ధార్థ దూకుడు తగ్గకపోవడంతో.. తనను బలపరిచే నాయకులు లేక.. ఆర్థర్.. టీడీపీ నేతలతో చేతులు కలిపారనే ప్రచారం సాగుతోంది. వారితో కలిసి లోపాయికారీగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో సిద్ధార్థరెడ్డిపై టీడీపీ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఆ పార్టీ నేతలు కామెంట్లు కుమ్మరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్థర్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ నేతలు బలం లేకున్నా.. దూకుడు చూపించడం వెనుక ఆర్థర్ వ్యూహమే ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ పంచాయితీ పెరిగి పెద్దది కానుందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.