ఎంట్రీ ఎంతసేపో…ఎగ్జిట్ కూడా…?
రాజకీయాలు అందరికీ కలిసి వస్తాయా ? అంటే చెప్పడం కష్టం. గతంలో ఎందరో సీఎంలు, మంత్రులు వారి వారి కుటుంబాలను రాజకీయాల్లోకి తెచ్చారు. కానీ, సక్సెస్ అయినవారు [more]
రాజకీయాలు అందరికీ కలిసి వస్తాయా ? అంటే చెప్పడం కష్టం. గతంలో ఎందరో సీఎంలు, మంత్రులు వారి వారి కుటుంబాలను రాజకీయాల్లోకి తెచ్చారు. కానీ, సక్సెస్ అయినవారు [more]
రాజకీయాలు అందరికీ కలిసి వస్తాయా ? అంటే చెప్పడం కష్టం. గతంలో ఎందరో సీఎంలు, మంత్రులు వారి వారి కుటుంబాలను రాజకీయాల్లోకి తెచ్చారు. కానీ, సక్సెస్ అయినవారు చాలా చాలా తక్కువ. అంతేకాదు, సీఎం తనయులు సీఎం అయిన వారిలో ఒకే ఒక్కడు జగన్. అది కూడా తనకంటూ పార్టీ పెట్టుకుని, డెవలప్ చేసుకుని, ఎన్నో అవరోధాలను నిచ్చెన మెట్లలా మార్చుకుని ప్రజలతో జై కొట్టించుకుని అధికారం దక్కించుకున్నాడు. మరి ఈ తరహా రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ చాలా వెనుకబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్నీ మైనస్ లేనా?
అంతేకాదు, రాజకీయాల్లో లోకేష్ అన్నీ మైనస్‌లే ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు పరిశీలకులు. కేవలం ఆయన బలవంతంగా రాజకీయాలు చేస్తున్నారే తప్ప.. ప్రజల అభీష్టం మేరకో తనకున్న పరిజ్ఞానం మేరకో, రాజకీయాలు చేయడం లేదని అంటున్నారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి 2017 వరకు కూడా లోకేష్ గురించి పెద్దగా తెలయలేదు. అయితే, 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మాత్రం లోకేష్‌ను చంద్రబాబు ఏకంగా కేబినెట్లోకి తీసుకున్నారు. దీనికి నాలుగు రోజుల ముందు మాత్రమే ఆయనను ఎమ్మెల్సీగా ప్రమోట్ చేశారు.
హడావిడగా మంత్రిని చేసి….
లోకేష్ ఎమ్మెల్సీ అయిన మూడు రోజులకే మంత్రి అవ్వడం.. ఈ తంతు అంతా హడావిడిగా జరగడం వెనక చంద్రబాబుపై కుటుంబ ఒత్తిళ్లు పనిచేశాయనే ప్రచారం అప్పట్లో టీడీపీ వర్గాల ద్వారా వినిపించింది. ఇక, మంత్రిగా అయినప్పటికీ లోకేష్ తనకంటూ ఇమేజ్ను సంపాయించుకునేందుకు తాపత్రయ పడ్డారే తప్ప, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంలో మాత్రం ఆయన సక్సెస్ కాలేక పోయారు. వాస్తవానికి చివరి యేడాదిలో పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందన్న విషయం గ్రహించిన కొందరు లోకేష్‌కు వాస్తవ పరిస్థితులు వివరించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు.
ఓటమి పాలయి…
అదే సమయంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా పోటీ చేశారు. తన భార్య, తల్లిని సైతం రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. రాజధాని ప్రాంతం కావడంతో లోకేష్ గెలుపునకు తిరుగు ఉండదనే అనుకున్నారు. అయినా కూడా ఓడిపోయారు. దీంతో ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలు అచ్చిరాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. నిజానికి చంద్రబాబు తనయుడికి ఓటమి ఉంటుందా? అని అనుకున్న వారు కూడా మంగళగిరి ఫలితంతో విస్మయం వ్యక్తం చేశారు. ఎక్కడ నోరు విప్పినా.. అనేక తప్పులు.. మళ్లీ వాటిని సరిచేసుకునేందుకు పార్టీ నాయకులు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. ఇదే, లోకేష్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
ఎమ్మెల్సీ పదవీ పోతే….
అదేవిధంగా మంగళగిరిని మందలగిరి అంటూ పేర్కొనడం వంటి ఆయనకు మైనస్ అయింది. ఇక, పార్టీలోనూ ఆయన పట్టు సాధించలేక పోయా రు. కేవలం భజన బృందానికి మాత్రమే దర్శనం ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు. ఇక, ఇప్పుడు లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, తాజాగా మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుండడంతో ఇది సక్సెస్ అయితే, లోకేష్ ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. అప్పుడు లోకేష్‌కు పార్టీ పదవి మినహా ఏం ఉండదు. ఇక రెండేళ్లలోనే ఎమ్మెల్సీ, మంత్రి, ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఇలా ఆయనకు రాజకీయ ఎంట్రీయే అచ్చిరాకుండా పోయింది.