Nara lokesh : ఎడమొహం.. పెడమొహం.. కారణమదేనా?
నారా లోకేష్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. ఆయన తన తండ్రి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక కొంత మనస్తాపానికి గురయ్యారు. అందుకే కొంత కాలంగా దూరంగా ఉంటున్నారన్న టాక్ [more]
నారా లోకేష్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. ఆయన తన తండ్రి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక కొంత మనస్తాపానికి గురయ్యారు. అందుకే కొంత కాలంగా దూరంగా ఉంటున్నారన్న టాక్ [more]
నారా లోకేష్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. ఆయన తన తండ్రి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక కొంత మనస్తాపానికి గురయ్యారు. అందుకే కొంత కాలంగా దూరంగా ఉంటున్నారన్న టాక్ కూడా పార్టీ ఇన్నర్ సర్కిళ్ల నుంచి విన్పిస్తుంది. కీలక నిర్ణయాల్లో తనను సంప్రదించకపోవడం, కొందరు సీనియర్ నేతలనే ఇంకా నమ్ముతుండటం లోకేష్ కు నచ్చడం లేదని తెలిసింది. మొన్నటి వరకూ లోకేష్ పట్ల కొంత చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో కొంత దూరం పెడుతున్నారంటున్నారు.
పీకే ఎంట్రీతో….
అదీ ప్రశాంత్ కిషోర్ మరోసారి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వస్తారని జగన్ మంత్రి వర్గ సమావేశంలో చెప్పిన తర్వాత చంద్రబాబు తీరులో మార్పు వచ్చిందంటున్నారు. అందుకు ప్రధాన కారణం లోకేష్ ను ఫోకస్ చేస్తే ప్రశాంత్ కిషోర్ టీం ఒక ఆటాడేసుకుంటుందన్న భయం పట్టుకుంది. లోకేష్ ను ఈ ఎన్నికలకు కొంత దూరంగా ఉంచితేనే బెటరని, అధికారంలోకి వచ్చిన తర్వాత చూడొచ్చని చంద్రబాబు నిర్ణయించారంటున్నారు.
కొద్ది రోజుల క్రితం….
కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ ఛార్జుల నియామకంలో కూడా లోకేష్ మాట చెల్లుబాటు అయింది. దాదాపు ఆయన చెప్పిన వారికే చంద్రబాబు ఒకే చెప్పారు. నియోజకవర్గాల పర్యటనలను కూడా లోకేష్ జోరుగా చేశారు. వైసీపీ వల్ల నష్టపోయిన పార్టీ కార్కకర్తల ఇళ్లకు వెళ్లి పరామర్శించి వచ్చారు. ఇక అత్యాచార సంఘటనలు జరిగితే గుంటూరు వెళ్లి ఆందోళన చేశారు. హత్యకు గురైన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వాళ్ల అంతిమ సంస్కార కార్యక్రమాల్లో కడప, కర్నూలు జిల్లాల్లో లోకేష్ పాల్గొన్నారు.
తాను యాత్ర చేస్తానంటే…?
అయితే ఉన్నట్లుండి లోకేష్ మౌనంగా ఉండటం వెనక చంద్రబాబు ఆయనను ముఖ్యమైన నిర్ణయాల్లో ఇన్ వాల్వ్ చేయకపోవడమే. దీనిపై ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతుంది. తాను యాత్ర చేస్తానంటే అవునని చెప్పిన చంద్రబాబు, తర్వాత సీనియర్ల మాట విని ఆయనే చేస్తానని చెప్పడం కూడా లోకేష్ కు నచ్చడం లేదని తెలిసింది. ఈ వయసులో తన తండ్రి రిస్క్ చేయడం కూడా లోకేష్ కు ఇష్టం లేదని, అందుకే ఆయన ఆ సలహా ఇచ్చిన సీనియర్ నేతల పట్ల గుర్రుగా ఉన్నారని తెలిసింది. మొత్తం మీద కారాణాలు ఏదైనా లోకేష్ కొంత ఎడమొహం.. పెడమొహంగానే ఉంటున్నారు.