చినబాబుకు ఆ కోరిక ఉందా?
తెలుగుదేశం పార్టీలో కోరికలు అందరికీ ఉన్నాయి. కానీ ఇపుడు నెరవేర్చుకునేందుకు అవకాశం ఏదీ? పార్టీ అధికారం కోల్పోయింది. ఏడాదిగా ఎవరికి వారుగా పసుపు తమ్ముళ్ళు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. [more]
తెలుగుదేశం పార్టీలో కోరికలు అందరికీ ఉన్నాయి. కానీ ఇపుడు నెరవేర్చుకునేందుకు అవకాశం ఏదీ? పార్టీ అధికారం కోల్పోయింది. ఏడాదిగా ఎవరికి వారుగా పసుపు తమ్ముళ్ళు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. [more]
తెలుగుదేశం పార్టీలో కోరికలు అందరికీ ఉన్నాయి. కానీ ఇపుడు నెరవేర్చుకునేందుకు అవకాశం ఏదీ? పార్టీ అధికారం కోల్పోయింది. ఏడాదిగా ఎవరికి వారుగా పసుపు తమ్ముళ్ళు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీకి పాతికేళ్ళ బట్టీ చంద్రబాబే అధ్యక్షుడు. ప్రాంతీయ పార్టీలకు సుదీర్ఘ కాలం అధినాయకులుగా పనిచేసిన వారిలో తమిళనాట డీఎంకే కరుణానిధిని మొదట చెప్పుకుంటారు. ఆయన ఉన్నంతవరకూ పార్టీ పీఠం కొడుకు స్టాలిన్ కి దక్కలేదు అయితే డీఎంకే వ్యవస్థ మొత్తం స్టాలినే చూసుకునే వారు. పేరుకే కరుణానిధి అన్నట్లుగా ఉండేది. ఏపీలో అలా కాదు. చంద్రబాబే టీడీపీ మొత్తానికి సర్వం సహా అని చెప్పాలి.
అది తీరింది కానీ…
నిజానికి చంద్రబాబుకు ఎవరి సామర్ధ్యం ఎంతో అంచనా ఉందని అంటారు. తన కుమారుడు అయినంత మాత్రాన లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వాలసిన అవసరం లేదని చంద్రబాబు కూడా మొదట్లో అనుకునేవారుట. కానీ ఇంట్లో పెద్ద ఎత్తున వచ్చిన వత్తిడి మూలంగానే లోకేష్ ఎమ్మెల్సీ అయి మరీ మంత్రి అయిపోయారు. అయిదు కీలకమైన శాఖలను కూడా తీసుకున్నారు. సరే పాలనానుభవం సంపాదిస్తారని, అండగా ఉంటారని చంద్రబాబు అనుకుంటే మరోలా జరిగింది. లోకేష్ అక్కడ పట్టు సంపాదించలేక బోల్తా పడ్డారు. అంతే కాదు, ఏకంగా మంత్రిగా పోటీ చేసి మంగళగిరిలో ఓటమి పాలు అయ్యారు. అలా ఒక కోరిక తీరీ తీరకుండా లోకేష్ కి ఉండిపోయింది.
అది చాలదా…?
ఇక లోకేష్ ని బాబు పార్టీలో కూడా పెద్ద పీట వేసి ప్రోత్సహించారు. తాను జాతీయ అధ్యక్షుడుగా ఉంటే చినబాబుని జాతీయ ప్రధాన కారదర్శిగా నియమించారు. ఇక ఆ పదవిలో లోకేష్ మొదట్లో కొంత చురుకుదనం చూపించి తెలంగాణాలో పార్టీని పటిష్టం చేయాలనుకున్నారు. అయితే జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో చినబాబు జాతీయ నాయకత్వం అలా బెడిసికొట్టింది. ఇక ఏపీలోనే చినబాబు కూడా కుదురుకు పోయారు. పేరుకు లోకేష్ జాతీయ హోదాలో ఉన్నారు కానీ చంద్రబాబే పార్టీ కధను అంతా నడిపిస్తున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఓడిపోవడంతో చినబాబు పూర్తిగా ఖాళీ అయిపోయారు. దాంతో ఆయనకు టీడీపీ ప్రెసిడెంట్ పదవి మీద కోరిక పుట్టిందని ప్రచారం సాగుతోంది.
అయ్యే పనేనా……?
చంద్రబాబు ఉండగా టీడీపీ అధ్యక్ష్య పీఠం మరొకరికి దారాదత్తం చేసే పని కుదిరేనా అన్నది పెద్ద ప్రశ్న. టీడీపీలో అయితే పార్టీ ఈ మాత్రం ఇలా ఉందంటే చంద్రబాబు వల్లనేనని అంటున్నారు. ఆయన కనుక పక్కకు తప్పుకుంటే టీడీపీ మునిగిపోవడం ఖాయమని కూడా అంటున్నారు. పార్టీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు వంటి వారు కూడా చంద్రబాబు తరువాత ఎవరు నాయకుడు అన్నది కాలమే నిర్ణయిస్తుంది అంటున్నారు తప్ప లోకేష్ పేరు చెప్పడంలేదు. మరి ఈ పరిణామాలు చూసుకుంటే లోకేష్ చేతికి టీడీపీ పగ్గాలు దక్కేది ఇప్పట్లో అనుమానమే. చంద్రబాబు 70 ఏళ్ళ పడిలో ఉన్నా ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు. దాంతో ఆయన సారధ్యంలోనే 2024 ఎన్నికలను ఎదుర్కొంటామని తమ్ముళ్ళు చెబుతున్నారు. మరి లోకేష్ కి అధినేత కావాలన్న కోరిక ఎంతవరకూ ఉందో తెలియదు కానీ పార్టీలో కొందరితో పాటు, కుటుంబం నుంచి కూడా వత్తిడి ఉందని అంటున్నారు. చంద్రబాబు ఈ వత్తిడి తట్టుకోలేకే మంత్రిని చేశారు. పార్టీ ప్రెసిడెంట్ చేస్తారని కలలో కూడా ఎవరూ అనుకోలేరు.